డిజిటల్ తెలంగాణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 10,000మంది నగరవాసులకు డిజిటల్ లిటరసిపై ప్రత్యేకంగా
శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నగరంలోని 28
మురికివాడల్లో 10,000మందిని డిజిటల్ లిటరసిపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రోజువారి
కార్యకలాపాల్లో డిజిటల్ టెక్నాలజిని ఉపయోగించుకోవడం ద్వారా మరింత
సులభతరమైన జీవనాన్ని గడిపేందుకుగాను ప్రతిఒక్కరిలో డిజిటల్ లిట్రసిని
పెంపొందించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇన్ ఇండియా అనే
కార్యక్రమం చేపట్టింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా డిజిటల్
తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకుగాను 10,000మంది నగరవాసులకు
డిజిటల్ లిటరసిని కల్పించాలని నిర్ణయించినట్లు జీహెచ్ఎంసి
కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలియజేశారు. ఇంగ్లీష్, హిందీ
లేదా తెలుగు భాషల్లో నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమాన్ని నగరంలోని
28కేంద్రాల్లో
ఏర్పాటు చేస్తున్నట్టు, ఒక్కో కేంద్రంలో
200మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి
తెలియజేశారు. ఈ శిక్షణ పొందేందుకు గాను 14నుండి 60సంవత్సరాలలోపు ఉండి ఐటి పరిజ్ఞానంలేని వారు అర్హులని
తెలిపారు. ఇందుకుగాను 28మందికి ప్రత్యేక శిక్షణను కూడా ఐటి విభాగం అడిషనల్ కమిషనర్
సురేంద్రమోహన్ ఆధ్వర్యంలో అందజేశామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా
ఈ క్రింది వాటిలో ఐటి నిరక్షరాసులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కమిషనర్
తెలిపారు. 1. కీబోర్డు నిర్వహణ పై శిక్షణ, 2. గూగుల్‌మ్యాప్‌ను
గుర్తించడం, 3. ఈ-మెయిల్ ఐడిలను క్రియేట్ చేయడం, 4. ఫోటోలు, సమాచారాన్ని
భద్రపర్చుకోవడానికై డిజిటల్ లాకర్లను క్రియేట్ చేయడం, 5. ఈ-మెయిల్
చదవడం, రిప్లే
పంపడం, 6. ఆన్‌లైన్
ద్వారా వార్త పత్రికలను చదవడం, 7. రైల్వే సమాచారాన్ని
తెలుసుకునేవిధంగా ఐఆర్‌సిటిసికి రిజిస్ట్రర్ చేసుకోవడం, 8. స్కైప్‌పై
పూర్తి అవగాహన కల్పించడం,
9. విక్కీపిడియా, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ల ద్వారా సమాచారం
తెలుసుకోవడం, 10. ఆధార్ లింక్ ద్వారా సమాచారాన్ని పొందడం తదితర
అంశాలను ఈ డిజిటల్ లెట్రసి ప్రోగ్రాం ద్వారా కల్పించనున్నట్టు
తెలిపారు. ఎంపిక చేసిన 28 ప్రాంతాల్లో జీహెచ్ఎంసి కమ్యునిటిహాల్
డిజిటల్ లిట్రసి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు
జీహెచ్ఎంసి కమిషనర్ పేర్కొన్నారు
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి