తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి, కరువు నివారణ కోసం చేపట్టే శాశ్వత చర్యల కోసం... జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక కార్యక్రమాలను వివరించారు.
ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి రాజీవ్ శర్మ,
రెవెన్యూ శాఖ ముఖ్య
కార్యదర్శి బిఆర్ మీనా
ఉన్నారు. ప్రధానమంత్రితో పాటు
కేంద్ర హోంమంత్రి రాజ్
నాథ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి రాధ
మోహన్ సింగ్, ఇతర
ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా
ఈ సారి 14శాతం
తక్కువ వర్షాలు పడ్డాయి. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఏడు జిల్లాల్లోని 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించమని ... .కరువు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి, ఇన్
పుట్ సబ్సిడీ అందించడానికి, మంచినీటి సరఫరా, పశుగ్రాసం అందచేయడానికి, ప్రజలకు ఉపాధి కల్పించడానికి రూ.3,064
కోట్లు కావాలని కోరం ... . కానీ
కేంద్రం కేవలం రూ.712
కోట్లు మాత్రమే విడుదల చేసిందని .. . మిగతా డబ్బులన్నీ విడుదల
చేయాల్సిందిగా కోరుతున్నాం’’ అని
ముఖ్యమంత్రి విన్నవించారు.
తెలంగాణా రాష్ట్రము లో కరువు వల్ల
13.52 లక్షల హెక్టార్లలో పంటలు
దెబ్బతిన్నాయి. 21.78 లక్షల మంది
రైతులు నష్టపోయారు. పత్తి,
మొక్కజొన్న, సోయాబీన్ లాంటి
పంటలు దెబ్బతిన్నాయి. 23,700 హెక్టార్లలో కూరగాయలు, మామిడి, బత్తాయి, పసుపు,
మిరప లాంటి తోటలు
దెబ్బతిన్నాయి.. మీరు
నిధులు
విడుదల చేస్తే మేము
వేగంగా ఇన్
పుట్ సబ్సిడీ ఇవ్వగలుగుతాం” అని
సిఎం చెప్పారు.
“తెలంగాణలో రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి, రుణ
విముక్తులను చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మందికి
చెందిన రూ. 17,000 కోట్ల రుణాలను మాఫీ చేశాము.
ఇప్పటికే మూడు విడతల
రుణ మాఫీ జరిగింది. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాము.
డ్రిప్, స్ర్పింక్లర్ల వినియోగం పెంచడానికి రూ. 302 కోట్లు
ఈ ఏడాది ఖర్చు
చేస్తున్నాం. 231 కరువు మండలాల్లో 64 లక్షల పశువులకు 5.58 లక్షల
మెట్రిక్ టన్నుల పశు గ్రాసాన్ని అందించాం. పశువులకు తాగునీళ్లు అందుబాటులో వుంచేందుకు 10,622 నీటి తొట్టెలను ఏర్పాటు చేశాం. పశుగ్రాసం అందించడం కోసం రూ.
75.90 కోట్లు అవసరమని గతంలోనే నివేదించినాం. ఆ నిధులు
త్వరగా ఇప్పించగలరు” అని
సిఎం ప్రధాని దృష్టికి తెచ్చారు.
కరువు వల్ల
ప్రజలు ఏలాంటి ఇబ్బందులు పడవద్దనే ముందుచూపుతోనే ప్రభుత్వం 2.82 కోట్ల మందికి నెలకు
6 కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యం అందిస్తున్నామని చెప్పారు. భూగోళంపై సరైన నిష్పత్తిలో చెట్లు లేకపోవడం వల్లే
వర్షాలు సరిగ్గా రావడం
లేదని, కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతం
పెంచేందుకు తెలంగాణకు హరిత
హారం అనే కార్యక్రమాన్ని చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల
మొక్కలు పెంచుతున్నామని సిఎం
వెల్లడించారు.
మిషన్
కాకతీయతో పాటు కృష్ణా,
గోదావరి నదుల్లో తెలంగాణకు వున్న వాటాకు అనుగుణంగా ప్రాజెక్టులు కూడా నిర్మిస్తున్నామని, 38 చోట్ల
రిజర్వాయర్లు, బ్యారేజిలు కడుతున్నామని ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారు. నీరు అందుబాటులోకి రావడం
వల్ల రైతులకు కరువు
నుండి శాశ్వత విముక్తి కలుగుతుందనేది తమ అభిమతమని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ప్రజలకు మంచినీరు అందించడం కోసం
ఇప్పటికే రూ. 303 కోట్లు
ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 2420 ఆవాస ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుండి
నీటి సరఫరా చేస్తున్నామని, ఏడు
వేలకు పెగా ప్రైవేట్ బోర్లను కిరాయికి తీసుకున్నామన్నారు. తాత్కాలికంగా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యల
కోసం రూ.227 కోట్లు
ఇవ్వాలని ప్రధానిని కేసిఆర్ కోరారు. మిషన్ భగీరథ
కార్యక్రమం చాలా మంచి
కార్యక్రమమని ప్రధానమంత్రి కొనియాడారు. కార్యక్రమం అమలు తీరును
అడిగి తెలుసుకున్నారు. పనుల
పురోగతిని ప్రధానికి వివరించిన సిఎం 2017 నాటికే 90 శాతం
లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కరువు వల్ల
పేదలు ఇబ్బంది పడవద్దని, ముఖ్యంగా భావితరం బాధపడవద్దనే ఉద్దేశ్యంతో ఎండా కాలంలో
కూడా రాష్ట్రంలోని 24 లక్షల
మంది విద్యార్థులకు మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు తోడు
రాష్ట్ర ప్రభుత్వపు వాటాను
కూడా కలిపి ఉపాధి
హామి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, కరువు
పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి
కల్పిస్తున్నామని చెప్పారు. 13 లక్షల
కుటుంబాలకు 150 రోజుల పాటు
పని కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.20 లక్షల ఇంకుడు
గుంతల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. కరువు
పరిస్థితులు వున్నా సాధారణ
జీవితానికి ఇబ్బంది కలుగవద్దనే ఉదేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 35.89 లక్షల మందికి ఆసరా
పెన్షన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. పెన్షన్ల కోసం కేంద్ర ప్రభుత్వం 253 కోట్లు మాత్రమే ఇస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 4800 కోట్లు ఖర్చు
చేస్తున్నదని వెల్లడించారు. రాష్ట్రంలోని 14 లక్షల
మంది ఎస్సీ, ఎస్టీ,
బీసి, మైనారిటీ, ఇబిసి
విద్యార్థులకు రూ. 2800 కోట్ల మేర
స్కాలర్ షిప్పులు అందిస్తున్నట్లు చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి