బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ కార్డు జారీ చేసే కార్యక్రమాన్ని దేశంలో తొలుత హరియాణా రాష్ట్రంలో ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేయాలని భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్ణయించింది. దీన్ని గుంటూరులోని సర్వజనాసుపత్రిలో బుధవారం ప్రారంభించారు. కేంద్రం రూపొందించిన సాఫ్ట్వేర్లో జనన ధ్రువపత్రం తయారుచేయడం కోసం వివరాలు నమోదు చేసే సమయంలోనే తల్లి లేదా తండ్రి ఆధార్ సంఖ్య, ఫోన్ నెంబరు వివరాలు జతచేస్తారు. ఆ వెంటనే బిడ్డకు కూడా 14 అంకెలతో కూడిన నమోదు (ఎన్రోల్మెంట్) సంఖ్య వస్తుంది. అదే ఆ పసిబిడ్డ శాశ్వత ఆధార్సంఖ్యగా మారుతుంది. పేరు పెట్టాక ఆధార్ కార్డులో మార్పు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నట్టుగానే ఐదేళ్ల తర్వాత బిడ్డ బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు. దీనివల్ల వివరాలు తప్పుగా నమోదు కావడానికి వీలుండదు. ప్రభుత్వం నుంచి పొందే అన్ని రకాల ప్రయోజనాలకు ఈ కార్డు ఉపయోగపడనుంది. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే జననాలకు మాత్రమే ఈ సదుపాయాన్ని త్వరలో ప్రైవేటు వైద్యశాలలకు వర్తించనుంది.
ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల స్థితిగులను ఆధార్ కార్డుతో మెక్రొసాప్ట్ వారు తయారు ప్రత్యేక ఆప్ తో అను సంధానం చేసి,స్కూలో విద్యార్థి చదువు, ఎప్పుడు స్కూల్ మానేసె ఆవకాశముంది, తదితర అంశాలను ఐదు మిలియన్ విద్యార్థులు,పది వేల ప్రభుత్వ పాఠశాలలో పరిశీలించే అవకాశముంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి