హిమాయత్ నగర్ డివిజన్ చంద్రానగర్ లోని ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో సిలిండర్ పేలి అట్టి ఇల్లు శిధిలావస్తు కు చేరింది. జరిగిన సంఘటనలో ఇంట్లో ఇద్దరికీ గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ GHMC జోనల్ డి.సి. గారిని, అర్.డి.ఓ మరియు ఎం.అర్.ఓ, పోలీసుల్ని సంఘటన జరిగిన ప్రదేశానికి పిలిపించారు. అర్.డి.ఓ ఆదేశాలు మేరకు ఎం.అర్.ఓ గారు ఆ ఇంటి పంచనామా చేయించి వెంటనే రెండు నుంచి మూడు రోజులలో ఆ బాధితులకు జరిగిన నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. డిప్యూటీ మేయర్ గారు ఆ ప్రాంతం లోని ఏ.ఎం.ఓ.హ్ గారికి ఆ కుటుంబానికి అక్కడి కమ్యునిటీహాల్‌లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేస్తూ వారికి నిత్య అవసరాలు మరియు వంట సామాగ్రి ఇప్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి