ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సంబంధిత కారణలతో నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉన్న దేశాలలో భారత్ ఒకటిగా మారింది. దేశంలో దక్షిణ ప్రాంతాల ప్రజలు ఏటా 78-91 గంటలు నిద్రను కోల్పోతున్నారు. ఇందులో 8-9 గంటల నిద్రలేమి కి వాతావరణ మార్పులే కారణమని క్లెమేట్ సెంట్రల్ సంస్ధ వెలువరించిన తాజా నివేదిక తెలుపుతుంది.ఇది దాదాపు 107 నగరాల్లో అధ్యయనం చేసి వాతావరణ మార్పుల కారణంగా అత్యధికంగా నిద్ర కోల్పోతున్న ప్రాంతంగా తమిళనాడు నమోదయింది. రాత్రి అధిక ఉష్ణోగ్రత కారణంగా ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున దాదాపు 56 గంటల నిద్రను కొల్పోయినట్లు గుర్తించారు.
టెగ్ దిగ్గజం గూగుల్ వినయోగదారుల కోసం గూగుల్ పైనాన్స్ యాప్ ను తయారు చేసింది. ఇది యూజర్లకు షేర్ మార్కెట్ పెట్టుబడులను సులభంగా పర్యవేక్షించకొవటానికి సహాయ పడుతుంది. ఎప్పటికప్పుడు మార్కెట్ సమాచారంతో పాటు ఏఐ ఆధారిత విశ్లేషనలను ఈ యాప్ అందిస్తుంది. దీనిలో వినియోగదారులు తమ పర్సనల్ వాచ్ లిస్ట్ లో తమకు ఆశక్తి ఉన్న కంపెనీ ల వివరాలను ట్రాక్ చేసుకొవచ్చు.కీ మూమోంట్స్ అనే కీలక ఫీచర్ ఈ యాప్ ముఖ్య ఆకర్షణ. ఇది షేర్ ధరల్లో ఆకస్మాత్తుగా చోటుచేసుకొనే మార్పుల కారణాలను ఏఐ విశ్లేషించి సులభంగా అర్థమయ్యే విధంగా వివరిస్తుంది. ఇదే కాకుండా వివిద కంపెనీల మార్రెట్ థోరణులపై లోతైన విశ్లేషన కోసం గూగుల్ ఏఐ రీసెర్చ్ ఆసిస్టెంట్ కూడా యూజర్లు వినియోగించవచ్చు.