తిరుపతిలో జరుగుతున్న తెదేపా మహానాడులో శుక్రవారం ప్రతిపాదించిన కార్యకర్తల సంక్షేమం- శిక్షణ, తెదేపా 35 ఏళ్ల ప్రస్థానంపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ జెండా మోసిన ఏ కార్యకర్తకూ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్ ఆదర్శ పాఠశాల, కళాశాలల ద్వారా కార్యకర్తల పిల్లలకు ఉచితంగా విద్యనందించడానికి అన్ని జిల్లాల్లోనూ ఎన్టీఆర్ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది కృష్ణా, వరంగల్ జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
కార్యకర్తల సంక్షేమ విభాగానికి లోకేష్ సమన్వయకర్తగా ఉన్నారని, గత 23 నెలల్లో ఈ విభాగానికి కార్యకర్తల నుంచి ఆరోగ్యం, ఆర్థిక సహాయం, విద్య, పింఛన్లకు సంబంధించి 25 వేల దరఖాస్తులు అందాయని, వాటిని పరిశీలించి దాదాపు 22 వేల దరఖాస్తులు పరిష్కరించినట్లు వివరించారు. 1563 మంది కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం, పింఛను, 665 మంది పిల్లలకు ఉచిత విద్య అందించినట్లు తెలిపారు. కార్యకర్తల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్‌మేళాలు నిర్వహించామని, దాదాపు 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. రూ.9 కోట్ల ఖర్చుతో బీమా సౌకర్యం కల్పించామన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి