ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమగ్ర కుటుంబ సర్వేకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే చరిత్ర పుటల్లోకి ఎక్కింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సమగ్ర కుటుంబ సర్వేను జాతీయ రికార్డుగా పేర్కొన్నది. ఈ మేరకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ ఘోష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికెట్ పంపారు.
సమగ్ర కుటుంబ సర్వే జరిగిన విధానం తదితర వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. భారతదేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులు 1.09 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించింది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ సర్వే నిర్వహించారని, కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు, వృత్తులు, ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తి పాస్తులు తదితర వివరాలన్నీ సేకరించారని అందులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడిందని సంస్థ పేర్కొన్నది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు