తెలంగాణా చీఫ్ మినిస్టర్ సమక్షం లో,తిమోతి డోనాల్డ్ టిం కుక్ ఆపిల్ మొబైల్ సి . ఇ . ఓ,హైదరాబాద్ లో డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంబించారు . ఆపిల్ కంపెనీ హైదరాబాద్ వైపు మోగ్గుచూపటం తో హైదరాబాద్ లో 4500 మందికి ఉఫాది లబించే ఆవకాశముంది. హైదరాబాద్లో ప్రస్తుతం 3.7 లక్షల మంది ఐటి కంపెనీలలో పనిచేస్తున్నారు. సుమారు 66 కోట్ల టర్ణోవర్ జరుగుతున్నట్లు అంచనా..తెలంగాణా ప్రభుత్వం ఐటి లో పెట్టుబడులు రాబట్టటానికి పూర్వవైభవం కొనసాగించటానికి ప్రయత్నిస్తుంది.గత సంవత్సరం గూగుల్ సంస్థ ఏడు ఎకరాలలో స్థలంలో తన కాంపాస్ ఏర్పాటు చేయటానికి ఎంఒయు కుదుర్చకున్న విషయం తెలిసిందే...
ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ మాట్లాడుతూ భారతదేశం, ఇక్కడి ప్రజల ఆతిథ్యం తనకెంతో నచ్చాయని, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆపిల్ సంస్థకు అందిస్తున్న సహాయ సహకారాలు, సహకరించిన విధానం తనకు చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సహకారం ఈ దేశ సంస్కృతిని ప్రతిభింభిస్తుందని అన్నారు. ఆతిథులకు సహకారం అందించడంలో భారతదేశం తమ దేశం కన్నా ముందు నిలుస్తుందని కొనియాడారు. ప్రపంచ ఐటి రంగ దిగ్గజాలయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ఆమెజాన్ వంటి సంస్థలు తమ కార్యలయాలను హైదరాబాద్ లో స్థాపించుకున్నాయని, వాటికి ఆపిల్ సంస్థ తోడవడం తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని అన్నారు. ప్రపంచ దిగ్గజం ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ రాక ద్వారా నూతన తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి దిశ నిరూపితమయిందని సిఎం అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి