ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఘనంగా తెలంగాణా రాష్ట్రావతరణ వేడుకలు

వచ్చే నెల 2 హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణ కేబినెట్ సబ్ కమిటి చైర్మన్ నాయిని నర్సింహరెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర అధికారులతో క్యాంపు కార్యాలయంలో మంగళవారం విషయమై సమీక్ష నిర్వహించారు

హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
--
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 తెలంగాణ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏర్పడాలి.
--
హైదరాబాద్ లో గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనే సభ నిర్వహించాలి
--
జిల్లా కేంద్రంలో జిల్లాకు చెందిన మంత్రి, కలెక్టర్, ఇతర ప్రముఖులందరూ కార్యక్రమంలో పాల్గొనాలి
--
అమర వీరుల కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రాల్లో ఘనంగా సన్మానించాలి. కార్యక్రమంలో వారికి విఐపి హోదా కల్పించాలి. 1969 ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా ఆహ్వానించి, గౌరవించాలి
--
జీవిత సాఫల్య పురస్కారంతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50 మందికి రాష్ట్ర స్థాయిలో, 25 మంది చొప్పున జిల్లా కేంద్రాల్లో అవార్డులు అందించాలి
--
హైదరాబాద్ తో పాటు, ఇతర నగరాలు, జిల్లా కేంద్రాల్లో వీధులను, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను అలంకరించాలి. పరిశ్రమలు, హాస్పిటళ్లు, హోటళ్లు, మాల్స్, థియేటర్స్ లలో కూడా పండుగ వాతావరణం ఉండాలి. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని తెలుపుతూ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయాలి
--
ఎయిర్ పోర్టు, హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లను కూడా అలంకరించి, బ్యానర్లు ఏర్పాటు చేయాలి
--
హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలి. అనాథ శరణాలయాలు, అంధుల పాఠశాలల్లో పండ్లు, స్వీట్లు పంచాలి. మాంసాహారం అందించాలి
--
రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి
--
దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి.
--
జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రాష్ట్ర ఆవిర్భావం ఇతివృత్తంగా తెలుగు, ఉర్ధూ భాషల్లో కవి సమ్మేళనాలు నిర్వహించాలి
--
రాష్ట్రంలోని అన్ని అమరవీరుల స్థూపాలను, తెలంగాణ తల్లి విగ్రహాలను అలంకరించాలి
--
విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలి
--
ట్యాంకు బండుపై జూన్ 2 రాత్రి పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబురాలు చేయాలి
--
నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేయాలి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

తెలంగాణకు హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ జిల్లాల్లో, తమ శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దుల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అందమైన రకరకాల పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కా ర్యక్రమాన్ని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 165 కిలోమీటర్ల రోడ్డుపై ఒకేసారి 85 వేల మంది మొక్కలు నాటుతారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటుతారు. ఈ మొత్తం రహదారిని 14 సెంగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెంగ్మెంటుకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షిస్తున్నారు. స్వయం సహాయక బృందాల సభ...

సీఎంపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల పాలనంతా అస్తవ్యస్తమేనని... వేసీపీ నేత రోజా విమర్శించారు. ఆయనకు మూడేళ్లూ కుర్చీ కాపాడుకోవటానికి సరిపోయిందన్న రోజా... వైఎస్ పథకాలను పేర్లు మార్చి మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆరోపించింది. కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసుంటే... 2009లోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది