ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రూ. 5ల‌క్ష‌ల బంప‌ర్ బ‌హుమ‌తి ....


2016-17 ఆర్థిక సంవ‌త్స‌రం ఆస్తిప‌న్నును ఈ నెల 31వ తేదీలోగా చెల్లించేవారికి న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న‌ట్టు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ‌జేశారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ప‌న్నును మే 31వ తేదీలోపు చెల్లించే ప‌న్నుదారుల‌కు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన 119 న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌మ ఆస్తిప‌న్నును ఆన్‌లైన్ విధానంతో పాటు జీహెచ్ఎంసి సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు, ఈ-సేవా కేంద్రాలు, ఎంపిక చేసిన బ్యాంకుల బ్రాంచీల‌లో చెల్లించ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. మే 1వ తేదీ నుండి ఈ నెల 31 తేదీ వ‌ర‌కు ప‌న్ను చెల్లించిన‌వారంద‌రినీ ఈ బ‌హుమ‌తులు అంద‌జేయ‌డానికి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. బంప‌ర్‌ బ‌హుమ‌తి 1,00,000న‌గ‌దు, మొద‌టి బ‌హుమ‌తి 50,000 రూపాయ‌లు ఒకొక్క‌రి చొప్పున, రెండ‌వ బహుమ‌తి రూ. 25,000 న‌గ‌దు ఇద్ద‌రికి, మూడ‌వ బ‌హుమ‌తి 10,000 రూపాయ‌ల చొప్పున ఐదుగురికి, నాలుగ‌వ బ‌హుమ‌తి 5,000రూపాయ‌ల చొప్పున ప‌ది మందికి, క‌న్సోలేష‌న్ బ‌హుమ‌తిగా 100మందికి 2,000 రూపాయ‌ల చొప్పున అంద‌జేయ‌నున్న‌ట్టు  క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి వివ‌రించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 14,38,835 మంది ఆస్తిప‌న్ను చెల్లింపుదారులు ఉండ‌గా కేవ‌లం 2,83,148మంది మాత్ర‌మే ప్ర‌స్తుత సంవ‌త్స‌రం ఆస్తిపన్నును  చెల్లించార‌ని పేర్కొన్నారు. ఇంకా 11,55,687మంది ఆస్తిప‌న్నును చెల్లించాల్సి ఉంద‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. ఆస్తిప‌న్నును వెంట‌నే చెల్లించ‌డం ద్వారా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మ‌రింత స్వ‌చ్ఛ న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌తిఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని క‌మిష‌న‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో విజ్ఞ‌ప్తి చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు