అత్యంత ఎత్తులో నిర్మించతలపెట్టిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపనకుతెలంగాణా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం చైనా ప్రభుత్వ నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులు తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుతో చర్చలు జరిపారు. గతంలో తాము చైనాలో చేపట్టిన ప్రతిష్టాత్మక కట్టడాలను సిఎంకు వివరించారు. 125 అడుగుల భారీ విగ్రహ ప్రతిష్టాపనకు కావలసిన డిజైన్, ఆర్కిటెక్చర్, నిర్మాణ సమయం తదితర అన్ని సాంకేతిక అంశాలపై సిఎం వారితో చర్చించారు.
ఖర్చుకు వెనకాడకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న విగ్రహ ప్రతిష్టాపన కోసం త్వరలో కమిటీ సభ్యులు చైనాను సందర్శించి అక్కడి నిర్మాణాల తీరును పరిశీలించి ఒప్పందం కుదర్చుకోనున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి