ఒబామా పదవీ కాలం వచ్చే జనవరిలో ముగుస్తున్నతరునం లో ప్రపంచ నేతల తో కలవలని ప్రధాని మోదీని ఒబామా ఆహ్వానించారు. వచ్చే వారంలో మోదీ అమెరికా పర్యాటన చేయనున్నారు. ప్రధాని ఈ నెల 7, 8 తేదీల్లో అమెరికాలో పర్యటిస్తారు. కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రావడం అత్యంత అరుదైన గౌరవమని ,ఒబామా-మోదీ బంధం వృద్ధి చెందడానికి కారణం మోదీ విదేశాంగ విధానం విజయవంతం కావడమేనని బిజే పీ చెబుతుంది.
ఇరు దేశాల సైన్యం మరింత సన్నిహితంగా సహకరించుకోవడం, అమెరికా డిఫెన్స్ మాన్యుఫాక్చరర్లు తమ హైటెక్ ఉత్పత్తులను భారతదేశంలో తయారు చేసి, అమ్మడం,. సైనిక విన్యాసాల ఖర్చులను భరించడం, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్లు, జియోస్పాషియల్ డేటా రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి