ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణా కేబినేట్ కీలక నిర్ణయాలు


 తెలంగాణా కేబినేట్   సమావేశం లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు . అవి

1. వరంగల్ లో అగ్రికల్చర్ కాలేజి ఏర్పాటు చేయాలని నిర్ణయం.
2. వరంగల్ జిల్లా మామునూర్ లో వెటర్నిటీ కాలేజి ఏర్పాటు చేయాలని నిర్ణయం.
3. తెలంగాణ రాష్ట్రంలో ఫిషరీస్ సైన్స్ కాలేజి ఏర్పాటు చేయాలని నిర్ణయం. మిషన్ కాకతీయ వల్ల చెరువులు బాగుపడ్డాయి కాబట్టి వాటిలో మత్స్యసంపదను పెంచాలని నిర్ణయం.
4. మెదక్ లో NIMZ, హైదరాబాద్ ఫార్మా NIMZ కోసం టిఎస్ఐఐసి రూ. 784 కోట్లు హడ్కో రుణం పొందడానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం.
5. దేవాదాయ, ధర్మాదాయ ధార్మిక సంస్థల్లో ట్రస్ట్ మెంబర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయం. కోటి ఆదాయం దాటిన సంస్థల్లో సభ్యుల సంఖ్యను 9 నుంచి 14, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు ఆదాయం ఉన్న సంస్థల్లో కూడా 9 నుంచి 14, రెండు నుంచి 25 లక్షల ఆదాయం కలిగిన సంస్థల్లో 5 నుంచి 7, రెండు లక్షల ఆదాయం లోపు వున్న వాటిలో మూడు నుంచి ఐదుకు ట్రస్టు మెంబర్లను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.
6. దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు చెల్లించడానికి అవసరమైన విధానం రూపకల్పన కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన శ్రీనివాసయాదవ్, నాయిని నర్సింహరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావులతో కేబినెట్ సబ్ కమిటీ. దేవాలయాల్లో వచ్చే ఆదాయం – దేవాలయ మాన్యాలు – అక్రమాల నియంత్రణ – హుండీ ఆదాయం దుర్వినియోగం తదితర అంశాలపై అధ్యయనం జరిపి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలకు పూర్వ వైభవం తేవడానికి కృషి.
7. మైక్రో ఇరిగేషన్ ను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ 1000 కోట్ల రూపాయల నాబార్డు రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం.
8. తెలంగాణలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడానికి, శాస్త్రీయమైన శీతల గిడ్డంగుల నిర్మాణం కోసం అవసరమైన వ్యూహాన్ని వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలు ఖరారు చేయాలని నిర్ణయం. కల్తీల నిరోధానికి చర్యలు తీసుకోవడానికి సిఫారసులు చేయాలి.
9. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను కేబినెట్ ఆమోదించింది.
10. అసైన్డ్ భూముల నిగ్గు తేల్చేందుకు, కమతాల ఏకీకరణకు, భూముల క్రమబద్ధీకరణకు, ప్రభుత్వ శాఖల వద్ద నిరుపయోగంగా వున్న భూముల వినియోగం కోసం అవసరమైన విధానం రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశిస్తూ నిర్ణయం.
11. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యత, ఎక్కువ నీటిని వినియోగించుకోవడమే లక్ష్యంగా ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, రీడిజైన్ చేయాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ప్రాణహిత – చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఆవశ్యకతను కేబినెట్ అంగీకరించింది.
12. తెలంగాణలో ఎంత మంది ఇంజనీర్లు, ఎంతో మంది టీచర్లు అవసరం? ఎంత మంది విద్యార్థులు ప్రతీ ఏటా ఇంజనీర్లు, టీచర్లు అవుతున్నారు? ఉద్యోగ అవకాశం లేకున్నా ఇంజనీరింగ్, బిఇడి కాలేజీల వల్ల వచ్చే అర్హులు నిరుద్యోగులు అవుతున్నారు. ఇలా జరగకుండా ఏమి చేయాలనే విషయంలో అవసరమైన విధానం రూపొందించాలని విద్యాశాఖను ఆదేశిస్తూ నిర్ణయం.
13. గోదావరి, కృష్ణా నదుల్లో వాటా ప్రకారమే ప్రాజెక్టులు కడుతున్నా ఏపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అబద్ధాలతో, అర్ధరహిత వాదనలతో కేంద్రానికి లేఖలు రాస్తున్నది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా స్పందించాలి. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని, కృష్ణా బోర్డు అధికారులను కలిసి వాస్తవాలు చేప్పి రావాలి. అవసరమైతే ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో బృందం ప్రధానిని కలిసి రావాలి.
14. వచ్చేనెలలో జరిగే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగమంతా భాగస్వామ్యం కావాలి.
15. సాదా బైనామాలు, మ్యుటెషన్స్, పౌతీల విషయంలో ప్రభుత్వం ఇటీవల తెచ్చిన భూ పరిపాలనా సంస్కరణలు కట్టుదిట్టంగా అమలు చేయాలి.
16. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం సైట్ వైజ్ టెండర్లు పిలవాలి. స్థానికులకే నిర్మాణ బాధ్యతలు అప్పగించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

తెలంగాణకు హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ జిల్లాల్లో, తమ శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దుల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అందమైన రకరకాల పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కా ర్యక్రమాన్ని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 165 కిలోమీటర్ల రోడ్డుపై ఒకేసారి 85 వేల మంది మొక్కలు నాటుతారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటుతారు. ఈ మొత్తం రహదారిని 14 సెంగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెంగ్మెంటుకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షిస్తున్నారు. స్వయం సహాయక బృందాల సభ...

సీఎంపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల పాలనంతా అస్తవ్యస్తమేనని... వేసీపీ నేత రోజా విమర్శించారు. ఆయనకు మూడేళ్లూ కుర్చీ కాపాడుకోవటానికి సరిపోయిందన్న రోజా... వైఎస్ పథకాలను పేర్లు మార్చి మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆరోపించింది. కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసుంటే... 2009లోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది