ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉదయ్ పథకంలో తెలంగాణ రాష్ట్రం

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ తో కే సీ ఆర్ 
విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కమ్)ను నష్టాల ఊబి నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉదయ్ (Ujwal DISCOM Assurance Yojana) పథకంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం అవుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. డిస్కమ్ లకు ఉన్న అప్పులను తీర్చడం ద్వారా వాటిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని స్పష్టం చేశారు. డిస్కమ్ ల అప్పులు తీర్చడానికి నిధులు సమీకరించుకోవడానికి ఎఫ్.ఆర్.బి.ఎమ్. మినహాయింపులు ఇవ్వడం సానుకూల అంశమని సిఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఉదయ్ పథకంలో చేరాలని సిఎంను కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలగా స్పందించారు. ఉదయ్ లో చేరడం ద్వారా జరిగే పరిణామాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దీన్ దయాల్ పథకంలో ఎక్కువ నిధులు ఇవ్వడంతో పాటు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించడానికి కేంద్ర మంత్రి అంగీకరించారు.
తెలంగాణ ఉదయ్ పథకంలో చేరాలని నిర్ణయించినందువల్ల కేంద్ర, రాష్ట్ర అధికారులు మరోసారి సమావేశమై ఒప్పందంపై సంతకాలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. దేశంలో ఎల్.ఇ.డి. లైట్ల వినియోగం అవసరంపై చర్చ జరిగింది. తెలంగాణలోని 26 నగర పంచాయితీలు, 12 మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే ఎల్.ఇ.డి. వీధిలైట్లు వాడుతున్నట్లు సిఎం చెప్పారు. రాష్ట వ్యాప్తంగా ఎల్ఇడి లైట్ల వినియోగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడతామని, విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రతీ ఇంటిలో ఎల్.ఇ.డి. బల్బులు ఉండేలా చూస్తామని సిఎం చెప్పారు. ఈ బల్బుల రేట్లు కూడా రోజురోజుకు తగ్గుతున్నందున ఇఇఎస్ఎల్ సంస్థతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు కుదుర్చుకోవాలని సిఎం చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా 22 లక్షలకు పైగా పంపుసెట్లున్నాయని, దీనికోసం ఎక్కువ విద్యుత్ వినియోగం అవుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ తక్కువ విద్యుత్ వినియోగం అవడంతో పాటు ఇంటి నుంచే నిర్వహించుకునే అధునాతన పంపుసెట్లు వచ్చాయని, వాటిని తెలంగాణలో విరివిగా వాడాలని సూచించారు. ప్రస్తుతమున్న పంపుసెట్లను దశలవారీగా మార్చేందుకు కేంద్ర అవసరమైన సాయం అందిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. తక్కువ విద్యుత్ అవసరమయ్యే ఫైవ్ స్టార్ ఫ్యాన్ల వాడకాన్ని కూడ ప్రోత్సహించాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యుత్ వినియోగదారులు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి అవసరమైన సహకారం కూడా ప్రభుత్వం నుంచి అందివ్వాలని ఇద్దరూ నిర్ణయానికొచ్చారు. ప్రతీ వినియోగదారుడు తాను ప్రతీ రోజు ఎంత విద్యుత్ వినియోగించిందీ తెలిపే యాప్ లను రూపొందిస్తామని సిఎం కేసీఆర్ వెల్లడించారు.
ఎక్కడ బొగ్గు గనులున్నాయో అక్కడే విద్యుత్ ప్లాంట్లు ఉంటే ఎక్కవ ప్రయోజనం ఉంటుందని సిఎం చెప్పారు. ఇలాంటి విద్యుత్ ప్లాంట్లకు స్థానికంగా ఉండే గనుల నుంచే బొగ్గును సరఫరా చేయాలని సిఎం కోరారు. తెలంగాణలోని ప్లాంట్లకు ఎక్కువ బొగ్గును సింగరేణి నుంచే కేటాయించడం వల్ల రవాణా భారం తగ్గుతుందన్నారు.
ఈ సందర్భంగా సిఎం రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను అధిగమించడంతో పాటు, రాబోయే కాలంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు, సౌర విద్యుత్ ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్ర మంత్రి సంతోషం, సంతృప్తి వ్యక్తం చేశారు.
సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు, కేంద్ర విద్యుత్ శాఖ సంయుక్త కార్యదర్శి జె.ఎస్. వర్మ, ఓఎస్డి అంజూ గుప్త, సీనియర్ అధికారి వెంకటేశం, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఎస్పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.లు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.