ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వ చర్యలు


1. గత ప్రభుత్వాలు ఆర్టీసీని అసలు పట్టించుకోలేదు. ఫలితంగా ఆర్టీసీ నష్టాలు అంతకంతకూ పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆర్టీసీకి రూ.2,275 కోట్ల అప్పు ఉంది. ప్రతీ నెలా నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఆర్టీసిని నడపడానికి చివరికి ఉద్యోగుల కో ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.180 కోట్లు తీసుకోవాల్సి వచ్చింది. ఈ దుస్థితి నుంచి కాపాడడం కోసం ఆర్టీసికి బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రతీ నెల రూ.75 కోట్ల చొప్పున ప్రభుత్వ సాయాన్ని ఆర్టీసికి అందిస్తున్నారు.
2. అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్ ఆర్టీసికి గుదిబండలా మారింది. ఎక్కువ నష్టాలు దీనివల్ల వస్తున్నాయి. ఈ దుస్థితి నుంచి గట్టెక్కించడానికి హైదరాబాద్ నగరంలో తిరిగే బస్సుల ద్వారా వచ్చే నష్టాన్ని క్రాస్ సబ్సిడి ద్వారా జిహెచ్ఎంసి భరించే విధాన నిర్ణయం తీసుకున్నారు.
3. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాల్సిన అవసరం ఉంది. 1100 బస్సులు పూర్తిగా పాడయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి కొనడంతో పాటు మరో 100 బస్సులు కొత్తవి కొనాల్సి వుంది. మొత్తంగా 1200 బస్సులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ.300 కోట్ల వరకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది.
4. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారి వేతనాలు పెంచింది. డీజిల్ రేట్లు కూడా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి.
5. విద్యార్థుల బస్సు పాసులతో పాటు, వివిద రాయితీల కింద ఇచ్చే బస్ పాస్ లపై అయ్యే వ్యయం దాదాపు రూ.500 కోట్లు ఉంటుంది. ఈ డబ్బును కూడా ప్రభుత్వం ఆర్టీసీకి ఎప్పటికప్పుడు చెల్లించాలని నిర్ణయించింది.
పల్లె వెలుగులో ఒక్క రూపాయే పెంచండి 
పల్లె వెలుగులో ఒక్క రూపాయే పెంచండి
ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల సహకారం కూడా అవసరమని, చార్జీలు పెంచాలని ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సామాన్యులు, పల్లె ప్రజలు ఎక్కువగా ప్రయాణించే పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్ల లోపు ఒక్క రూపాయి, 30 కిలో మీటర్ల పైన (ఎంత దూరమైనా) రెండు రూపాయలు మాత్రమే ధర పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. సగం మంది ఆర్టీసీ ప్రయాణికులు పల్లె వెలుగు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు కాబట్టి, పేదలకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని, అందుకే పల్లె వెలుగు చార్జీలను పెద్దగా పెంచవద్దని సిఎం చెప్పారు. మిగతా బస్సుల్లో కూడా పదిశాతం మించకుండా చార్జీలు పెంచాలని సిఎం సూచించారు.
సింగరేణిపై దృష్టి పెట్టండి

తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థయిన సింగరేణిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే సింగరేణిపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, అన్ని అంశాలను చర్చించనున్నట్లు వెల్లడించారు.
చార్జీల పెంపుపై  తుది నిర్ణయం

తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయం గురువారం వెలువడే అవకాశం ఉంది. ఈ రెండు శాఖల అధికారులు తమ ప్రతిపాదనలు సిఎంకు వివరించగా, సిఎం కూడా పలు సూచనలు చేశారు. సామాన్యులపై భారం పడని విధంగా పెంపు ఉండాలనే సిఎం సూచనల మేరకు అధికారులు తుది నివేదిక తయారు చేయనున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఇతర ప్రాంతాల్లో పర్యటనల్లో ఉండడంతో గురువారం పెంపు విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

తెలంగాణకు హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ జిల్లాల్లో, తమ శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దుల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అందమైన రకరకాల పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కా ర్యక్రమాన్ని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 165 కిలోమీటర్ల రోడ్డుపై ఒకేసారి 85 వేల మంది మొక్కలు నాటుతారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటుతారు. ఈ మొత్తం రహదారిని 14 సెంగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెంగ్మెంటుకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షిస్తున్నారు. స్వయం సహాయక బృందాల సభ...

సీఎంపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల పాలనంతా అస్తవ్యస్తమేనని... వేసీపీ నేత రోజా విమర్శించారు. ఆయనకు మూడేళ్లూ కుర్చీ కాపాడుకోవటానికి సరిపోయిందన్న రోజా... వైఎస్ పథకాలను పేర్లు మార్చి మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆరోపించింది. కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసుంటే... 2009లోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది