ఏడు మిషన్లతో ఆరంభమైన మన ప్రగతి ప్రస్థానం ఏడాది తిరిగే సరికే ఫలితాలను
ఇవ్వడం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా నిరుత్సాహకర పరిస్థితి వుండగా,
దానికి భిన్నంగా జాతీయస్థాయిలో కనిపించిన ఆశావాహ
దృక్పధాన్ని ఆలంబనగా
తీసుకుని, కొత్త రాష్ట్రంలో పరవళ్లు తొక్కే ఉత్సాహాన్నే ఊతంగా మార్చుకుని
తొలి ఏడాదిలోనే అద్భుతమైన ఆర్థిక ఫలితాల్ని సొంతం చేసుకున్నాం. 10.9శాతం
వృద్ధి రేటును సాధించాం. పదేళ్ల పాలనకు సంబంధించిన సమస్యలు, రాష్ట్ర విభజన
తెచ్చిన సంక్లిష్టతలు, ఇలా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వున్నా రెండంకెల వృద్ధి రేటు సాధించడం ఈ ప్రభుత్వం సాధించిన తొలి విజయం.
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా 7వ స్థానంలో, జనాభాపరంగా 10వ స్థానంలో ఉంది. అయినా, 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 10.9 శాతం వృద్ధిరేటు నమోదుచేసుకుంది. అంతకుముందు ఏడాది కంటే 2.1 శాతం వృద్ధి రేటు పెరిగింది. వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాలలో కలిపి 8.40 శాతం, పరిశ్రమల రంగంలో 11.13 శాతం, సేవల రంగంలో 11.39 శాతం వృద్ధి కనిపించింది.
తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం లక్ష రూపాయిలకు పైగా నమోదు కావడం మరో రికార్డు. 7జిల్లాలలో తలసరి ఆదాయం లక్ష రూపాయిలుగా ఉంది. అంతకుముందు ఏడాది తలసరి ఆదాయం రూ.97,855 కాగా, 2015లో 1.07 లక్షలకు చేరుకుంది. జీఎస్‌డీపీలో మన రాష్ట్రం 8వ స్థానం నుంచి 6వ స్థానానికి వచ్చింది. తలసరి ఆదాయంలో 9వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరుకుంది.
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన రెండేళ్ల వ్యవధిలోనే రెండంకెల సుస్థిర వృద్ధి రేటు సాధించడం నిజంగా అపూర్వం, అనితర సాధ్యం. అభివృద్ధి దార్శనికత, ఆర్థికాభివృద్ధికి అనుసరిస్తున్న సమగ్ర ప్రణాళిక, సమర్ధ కార్యాచరణ వల్లనే ఈ వృద్ధి మనకు సాధ్యమైంది. ఇదే ఉత్సాహంతో 2016-17 సంవత్సరానికి 15 శాతం వృద్ధి రేటు సాధించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
2016-17 ఆర్ధిక సంవత్సరంలో లక్ష్యాలను కూడా ప్రభుత్వం నిర్దేశించుకుంది. రూ. 6,66,634 కోట్లు జీవీఏ సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రాథమికరంగంలో రూ.2,02,365 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.1,52,706 కోట్లు, సేవల రంగంలో 3,11,563 కోట్లు ఆర్జించాలని నిర్ణయించింది.
ఈ ఏడాది వృద్ధి లక్ష్యం 19.54 శాతం
2016-17లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు 19.54 శాతంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16లో దేశ సగటు వృద్ధి 7.6 శాతంగా ఉండగా, రాష్ట్ర వృద్ధి 10.99 శాతంగా ఉంది. దాంతో రాష్ట్ర వృద్ధి గణనీయంగా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర స్థూల అదనపు విలువ రూ.6,66,634 కోట్లుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతవరకు తిరోగమనంలో ఉన్న వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళిక రూపొందించారు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి