ఆకుపచ్చ తెలంగాణ సాధనదాకా విశ్రమించేది లేదని భారీనీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేసీఆర్ స్వప్నమైన కోటి ఎకరాలకు నీటి సాధనకు త్రిముఖవ్యూహం అమలు చేస్తున్నామని అన్నారు. త్యాగాలు, బలి దానాలతో తెచ్చుకున్న తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకే కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశారని వివరించారు. తమ్మిడిహట్టి ఎత్తు మీద రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ 152 మీటర్లపై మహారాష్ట్రతో ఒప్పందం ఉంటే బయటపెట్టాలని సవాలు చేశారు.
-రీడిజైనింగ్ అంటే ఆకుపచ్చ తెలంగాణకు రోడ్‌మ్యాప్..
-పెండింగు ప్రాజెక్టులకు 8వేల కోట్లు ఇచ్చాం
-తమ్మిడిహట్టిపై కాంగ్రెస్‌ది గోబెల్స్ ప్రచారం
-152 మీటర్ల ఒప్పందముంటే బయటపెట్టాలి
-తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేక తీర్మానానికి టీటీడీపీ హర్షం దుర్మార్గం
-ఆశించిన స్థాయిలో కేంద్ర సర్కారు సహకరించలేదు
-ఇంజినీర్లు రోజుకు 18 గంటలకు పైగా కష్టపడుతున్నరు
-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
టీడీపీ మహానాడులో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే టీటీడీపీ నేతలు చప్పట్లు కొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి హరీశ్‌రావు నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి తెలంగాణ రైతాంగ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి...
ప్ర: తెలంగాణ సాగునీటి రంగ ప్రస్థానం ఎలా ఉంటుంది?
జ: సుదీర్ఘ పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణను ఆకుపచ్చగా మార్చుకునేందుకు సీఎం కేసీఆర్ త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. సమైక్య పాలకుల కుట్రతో ధ్వంసమైన చిన్న నీటిపారుదల వ్యవస్థకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు మిషన్ కాకతీయ ద్వారా 46,500 చెరువులను పునరుద్ధరిస్తున్నరు. వర్షాలు బాగా ఉన్న ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అనేక చెరువుల కింద ప్రజలు మిషన్ కాకతీయ మొదటి దశ ఫలాల్ని అందుకున్నారు.
ఇక రెండో వ్యూహంగా... సమైక్య పాలనలో తెలంగాణకు కించిత్తు తెలంగాణ ప్రయోజనం లేకుండా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ నీటి వాటాను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇంజినీర్‌లా ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకవైపు గోదావరిపై కాళేశ్వరం, ప్రాణహిత, కృష్ణపై పాలమూరు ప్రాజెక్టుల రూపకల్పన పూర్తి చేసినం. ఇక మూడో వ్యూహంగా... కొత్తగా ప్రాజెక్టులు చేపడుతున్నం. ఇలా మూడు మార్గాల్లో నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం సాక్షాత్కరిస్తుంది.

పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేయటం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల మాటేమిటి?
కాంగ్రెస్, టీడీపీలకు రాజకీయాలే పరమావధిగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పెండింగు ప్రాజెక్టులపై గోబెల్ ప్రచారం చేస్తుంది. మా హయాంలో 90 శాతం పూర్తి చేశాం. ఇంకా పది శాతం పూర్తి చేస్తే సాగునీరు అందుతుంది అనేది వాళ్ల అబద్ధపు ప్రచారం. వాస్తవం ఏమిటంటే 90 శాతం పనులు కాదు... నిధులు ఖర్చయ్యాయి. పనులు 50-60 శాతానికి మించి జరగలేదు. వాళ్లది నిధుల మేత తప్ప ప్రాజెక్టుల పూర్తి కాదు. చేసిన పనులు ఎక్కడ చేశారు? ఇబ్బందులు లేనిచోట సులువైన పనులను పూర్తి చేసి నిధులు దండుకున్నారు. ఇబ్బందికరమైన భూసేకరణ సమస్యలు గాలికి వదిలేశారు. చాలా చిక్కుముళ్లు(బాటిల్ నెక్స్) ఉన్నయి. ఇపుడు ఆ చిక్కుముళ్లను విప్పడం మా వంతు అయింది. అయినా త్వరితగతిన పెండింగు ప్రాజెక్టుల ద్వారా ఈ ఖరీఫ్‌కే 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నం. టీడీపీది తాడు బొంగరము లేని వాదన. రూ.వెయ్యి కోట్లు పెడితే పెండింగు ప్రాజెక్టులు పూర్తవుతాయంటారు. కానీ సీఎం కేసీఆర్ ఈ ఏడాదికి ఏకంగా రూ.8వేల కోట్లు ఇచ్చారు.

రెండేండ్లలో ప్రభుత్వం సాధించిన లక్ష్యాలేమిటి?
పదేండ్ల కాంగ్రెస్ హయాంలో 33 ప్రాజెక్టులు చేపడితే మూడు మాత్రమే పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ ఆ పెండింగు ప్రాజెక్టుల చిక్కుముళ్లను విప్పి యుద్ధప్రాతిపదికన పనులు జరిపిస్తున్నారు. వాటిలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు త్వరలో సాగునీరు అందిస్తాం. ఆదిలాబాద్ మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. నల్లగొండలో ఉదయ సముద్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిజాంసాగర్ ఆధునీకరణను వందశాతం పూర్తి చేశాం. కాంగ్రెస్ ఎనిమిదేండ్లలో కదలని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణను నిత్య పర్యవేక్షణతో వేగంగా ముందుకు తీసుకుపోవడంతో ప్రపంచ బ్యాంకు రేటింగ్‌లో ఆసియాలోనే ది బెస్ట్ అని కితాబిచ్చింది. కరీంనగర్ మిడ్‌మానేరులో ఈసారి మూడు టీఎంసీల నీళ్లు నింపునున్నాం. ఎల్లంపల్లిలో పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం మేరకు 20 టీఎంసీల నీళ్లు నింపనున్నాం.

కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులంటే అవినీతి అనేవారు. ఆ జాడ్యాన్ని వదిలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
వాస్తవమే... కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులంటేనే బిల్లులు దండుకోవడం. అందుకే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే అవినీతికి అవకాశం కల్పించే ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని రద్దు చేశాం. భూసేకరణలో అవినీతితో పాటు ఏండ్ల తరబడి కాలయాపన లేకుండా ల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలుకు జీవో 123ను ప్రవేశపెట్టాం. మొబిలైజేషన్ అడ్వాన్సు అనే విధానాన్ని పూర్తిగా తీసివేశాం.

మరి ఇంత స్పష్టత ఉన్నా... కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుండటంపై మీ అభిప్రాయం?
వాళ్లకు రాజకీయాలే కావాలి. రెండు సవాళ్లు విసురుతున్నా. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ ఎత్తును మేమేదో తగ్గించామనే దుష్ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే కనుక..కాంగ్రెస్ పార్టీ 152 మీటర్లకు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని బయటపెట్టాలి. చూపించమనండి. అదేవిధంగా వాళ్లు గ్రావిటీతో ప్రాజెక్టు పెడితే మేం దాన్ని లిఫ్టు చేశామంటున్నారు.కాంగ్రెస్ డిజైన్‌లో కూడా 38 మీటర్ల లిఫ్టు ఉంది. కాంగ్రెస్ నాయకులు చెబుతున్నది నిజమైతే... వాళ్ల డిజైన్‌లో గ్రావిటీ ఎక్కడ ఉందో రుజువు చేయాలి.

భూ నిర్వాసితులకు అండగా ఉంటామంటూ కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు?
వారి ప్రకటన హాస్యాస్పదం. ఇదే పొన్నాల లక్ష్మయ్య నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నపుడు ఆయన 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ ఆయన నియోజకవర్గం జనగాంలోనే ఎకరానికి రూ.80వేల నుంచి 1.30 లక్షలు మాత్రమే ఇచ్చారు. వాళ్లది కేవలం అధికారం కోసం పోరాటం... మాది అభివృద్ధి కోసం ఆరాటం. మనం ఎకరానికి ఆరు లక్షలు, ఇతర సదుపాయాలతో కలిపి రూ.8 లక్షల పరిహారం ఇస్తున్నం.

మహారాష్ట్రతో ఒప్పందాలు పూర్తిస్థాయిలో ఎప్పుడు జరుగుతాయి?
చనాక-కొరాట, తమ్మిడిహట్టి బ్యారేజీలపై స్పష్టత వచ్చింది. మేడిగడ్డపై వంద మీటర్లకు మహారాష్ట్ర అంగీకరించింది. మనం 101 మీటర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్ర సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ అధికారులు మహారాష్ట్ర సీడీవోకు అన్ని వివరాలు పంపారు. వాళ్ల పరిశీలన ఈ రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. జూన్ రెండు, మూడు వారాల్లో రెండు రాష్ర్టాల మధ్య సాంకేతిక ఒప్పందాలు పూర్తవుతాయి.

మిషన్ కాకతీయ రెండో దశ పనులు కొనసాగుతుండగానే మూడో దశపై ఎందుకు దృష్టిపెట్టారు?
ఇది అనుభవం నేర్పిన పాఠం. గతంలోని అనుభవాలను మేళవించి ముందస్తుగానే మూడో దశను ప్రారంభిస్తున్నాం. దీనివల్ల అంచనాలు, టెండర్ల ప్రక్రియకు కాలవ్యవధి వెసులుబాటు లభించింది. గతంలో ఒక్కో ఇంజినీర్ ఏడాదికి మూడు, నాలుగు చెరువులు చేస్తే మహా గొప్ప. కానీ ఇప్పుడు ఏకంగా 30-35 చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయవచ్చని చెప్పడానికి ఇది ఓ నిదర్శనం.

సాగునీటి రంగానికి సంబంధించి కేంద్ర సర్కారు సహకారం ఎలా ఉంది?
ఆశించినస్థాయిలో సహకారం లేదు. గడిచిన ఏడాదిలో చేసిన ఒత్తిడి మేరకు పీఎంకేఎస్‌వై కింద 11 ప్రాజెక్టులను తీసుకున్నారు. ఇక ముందు నిధులు ఆశించినస్థాయిలో వస్తాయని అనుకుంటున్నాం.
తెలంగాణ సమాజానికి మీరిచ్చే సందేశం.

సుదీర్ఘ పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. ప్రజలు ఉద్యమనేత కేసీఆర్‌ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆయన చేతిలో రాష్ట్రం పదిలంగా ఉంది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై టీడీపీ, ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నాయి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా అన్ని ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి తీరుతుందని హామీ ఇస్తున్నాం.
రీడిజైనింగ్ వల్ల కలిగే అదనపు ప్రయోజనాలేమిటి?
రీడిజైనింగ్ మీద కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. కానీ ఎక్కడెక్కడ రీడిజైనింగ్ జరిగిందో... కాంగ్రెస్ హయాంలో వాటి దుస్థితి ఏమిటో పరిశీలిస్తే ఆ పార్టీ బండారం బయటపడుతుంది. 2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ మొదలుపెట్టింది. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ డిజైన్ చేశారు. బ్యారేజీ లేకుండానే రూ.8వేల కోట్ల కాలువలు తవ్వేశారు. మహారాష్ట్రను మనం సంప్రదిస్తే ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్లకు ఒప్పుకోమని తేల్చి చెప్పినందునే 148 మీటర్లతో బ్యారేజీ నిర్మాణానికి సిద్ధమైనం. కాంగ్రెస్ పార్టీ 152 మీటర్లకు కడుతుంటే మేం ఎత్తు తగ్గించామనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే 152 మీటర్లకు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం బయటపెట్టాలి.ఇక నీటి సంగతి. తమ్మిడిహట్టి దగ్గర 160 టీఎంసీల నీటిని మళ్లిస్తామని కాంగ్రెస్ హయాంలో డిజైన్ చేశారు. కానీ అక్కడ నీటి లభ్యత 120 టీఎంసీలే ఉందని కేంద్ర జల సంఘం తేల్చి చెప్పింది. అంటే మహారాష్ట్ర ఒప్పుకున్న 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే నీటి లభ్యత 44 టీఎంసీలే ఉంటుంది.

ఇలాంటి సమస్య ఉంది కాబట్టే. ప్రభుత్వం మేడిగడ్డ అనుకున్నది. ఇక్కడ 160 టీఎంసీలు కాదు అవసరమైతే 400 టీఎంసీలను కూడా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించింది. ఇంతాచేసి కాంగ్రెస్ ప్రాణహిత-చేవెళ్లలో పెట్టింది 11 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమే. మేం 152 టీఎంసీలకు పైగా నిల్వ కోసం రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం. ఇక ఖమ్మం ప్రాజెక్టులు. ఆరు పోలవరం ముంపు మండలాల్ని ఏపీలో కలపడం వల్ల ఇందిరాసాగర్ హెడ్‌వర్క్ రుద్రమకోట ఏపీ భూభాగంలోకి పోయింది. పాత పద్ధతిలో ప్రాజెక్టు కడితే నీళ్లకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మనం ఆధారపడాలి. అందుకే అలా కాకుండా సమీకృత రీడిజైనింగ్ ద్వారా సీతారామ ప్రాజెక్టు రూపొందించాం. పాత డిజైన్‌లో స్టోరేజీ కేవలం అర టీఎంసీ అయితే ఇప్పుడు 12.5 టీఎంసీలు పెట్టాం. ఎంత కరువు వచ్చినా పాలేరు, వైరా, లంకసాగర్, పెద్దవాగు మీడియం ప్రాజెక్టులకు నీరుంటుంది. ఇవీ రీడిజైనింగ్ వల్ల లాభాలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి