దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం లక్ష కుటుంబాల్లో వెలుగు నింపి కొత్త రికార్డు
సృష్టించిందని
తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. 2014 సెప్టెంబర్ 24న రాష్ర్ట్రంలో కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం ప్రారంభమై
తర్వాత ఇప్పటి దాకా
44,351 మంది ఎస్సీ అమ్మాయిలకు, 25,793 మంది ఎస్టీ అమ్మాయిలకు, 33,913 మంది మైనారిటీ అమ్మాయిలకు... మొత్తం 1,04,057 మందికి ఈ పథకం ద్వారా రూ.51వేల ఆర్థిక సహాయం అందింది. ఇందుకోసం ఇప్పటి దాకా రూ.530 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పేదింటి ఆడపిల్ల పెండ్లి భారం ప్రభుత్వం పంచుకోవడంతో చాలా కుటుంబాల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్న సమాచారం ప్రభుత్వానికి అందింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి బిసిలు, ఇతర ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు కూడా ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఈ పథకం కోసం
2016-17 బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.150 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.200 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.88కోట్లు, బిసి సంక్షేమ శాఖకు రూ.300 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రూ.738కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకం పేదింటి ఆడపిల్ల పెండ్లి కష్టాలను తీర్చడమే కాకుండా, బాల్య వివాహాలను నియంత్రించే సామాజిక మార్పును కూడా ఈ పథకం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేదింటి ఆడపిల్లలందరికీ పథకం వర్తింపచేయాలని, బడ్జెట్లో కేటాయించిన నిధులే కాకుండా అవసరమైతే ఎక్కువ నిధులు కేటాయించడానికి కూడా ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. పథకంలోని మహోన్నత, మానవత్వ కోణాన్ని అర్థం చేసుకుని అధికారులు పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేయడానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని సిఎం ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్ రెడ్డి తెలిపారు.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి