నల్గొండ మహాత్మాగాంధి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నియామకమయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు బుధవారం సంతకం చేశారు. వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన ఖాజా అల్తాఫ్ కాకతీయ యూనివర్సిటీ లో ఫిజిక్స్ ప్రొఫెసర్. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి