సన్ రైజర్స్ యజమాని, సన్ గ్రూపు సిఎండి కళానిధి మారన్, సిఇవో షణ్ముగం, జెమిని టివి ఎండి కిరణ్, జిఎం బాలక్రిష్ణన్, చీఫ్ రిప్రజెంటేటివ్ ఐవి. నగేశ్ తదితరులు గురువారం క్యాంపు కార్యాలయలో ముఖ్యమంత్రిని కలిసారు . సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపిఎల్ -9 చాంపియన్ షిప్ గెలుచుకోవడం తెలంగాణకు, హైదరాబాద్ కు గర్వకారణమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. క్రికెటర్లను, జట్టు యజమాని అయిన సన్ గ్రూపును ముఖ్యమంత్రి అభినందించారు.
మొదటి నుంచి సన్ రైజర్స్ జట్టును ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించి విజయవంతం చేసిందని కళానిధి మారన్ ధన్యవాదాలు తెలిపారు. సన్ రైజర్స్ విజయం సాధించడానికి కెప్టెన్ డేవిడ్ వార్నర్ నాయకత్వం ప్రధాన కారణమని, బౌలింగ్ విభాగం ప్రతిభతో విజయాలు సాధించామని వివరించారు. హైదరాబాద్ జట్టు టైటిల్ గెలవడం వల్ల వచ్చే సీజన్ ప్రారంభం ఇక్కడే జరుగుతుందని, ఫైనల్ మ్యాచ్ కూడా హైదరాబాద్ లోనే ఆడతారని కళానిధి చెప్పారు. ఈ రెండు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కేసీఆర్ ను వారు ఆహ్వానించారు. కేసీఆర్ వారి ఆహ్వానాన్ని మన్నించారు. ఐపిఎల్ 10 ప్రారంభ కార్యక్రమాన్ని, ముగింపును కూడా ఘనంగా నిర్వహిద్దామని సిఎం చెప్పారు.
ఐపిఎల్ మ్యాచ్ లు, టి 20, ఇతర మ్యాచ్ లు, వేదికలు తదితర విషయాలు కూడా చర్చించారు. కళానిధి మారన్ సోదరుడు, మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ తో ఉన్న అనుబంధాన్ని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సన్ రైజర్స్ ఇదే విధంగా ముందుకు పోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.తో
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి