ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ఉండదు. ప్రకృతి విక్రుత రూపం దాల్చకముందే ప్రకృతిని కాపాడుకొవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించేలా ఈ దినం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చెట్లు పూర్తిగా క్షీణించిన ఆవరణ వ్యవస్థను సైతం పునరుజ్జీవం పొస్తాయి భూగర్భ నీటి మట్టాన్ని పెంచటానికి దొహదపడుతాయి. వరదలు, భారీ వర్షాల సమయంలో నేల కోతను, కురిసే వర్షం ఎక్కడికక్కడ భూమిలో ఇంకకుండా ప్రవహిస్తూ పొతే నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి విలువైన పోషకాలు పైమట్టితో పాటు కొట్టుకుపోతాయి. దీనివల్ల భూమి సారం తగ్గిడం వలన ప్రస్తుతం రైతులు రసాయనాలను వాడవలసి వస్తోంది. చెట్లను నాటడం అవసరం. వర్షపు నీరు ఎక్కడికక్కడ ఇంకిపోయేలా ఇంకుడుగుంతలు, పంట కుంటలు ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ఇటుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంట సంజీవని పథకం ద్వారా పదిలక్షల పంట కుంటల త్రవ్వకానికి నడుం కట్టింది. అటు తెలంగాణ ప్రభుత్వం హరిత హారం పేరుతో పర్యావాణన్ని కాపాడుకుందాం ,చెట్లను నాటుదం అనే నినాదం ఇచ్చింది. సహజ వనరులను కాపాడుకుంటూ, ప్రకృతి తో ఏకమై ప్రశాంతంగా జీవీస్తూ మన పరిసరాలని పచ్చగా , పరిశుభ్రం గా ఉంచుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి