తెలంగాణ ఆర్టీసికి తక్షణ సాయంగా రూ. 300 కోట్లు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ. 350 కోట్ల రుణాన్ని ఆర్టీసికి ఇప్పించాలని అధికారులకు సూచించారు. టిఎస్ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నందున అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేసి సంస్థను లాభాల బాట పట్టించాలని ఆర్టీసీపై మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండి జెవి రమణారావు తదితరులతో గురువారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు.
బస్సు పాసుల కోసం ఇస్తున్న రూ. 500 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని దీనికి సంబంధించిన డబ్బులను వెంటవెంటనే విడుదల చేయాలని , జిహెచ్ఎంసి రూ. 190 కోట్ల వరకు భరిస్తున్నదని, ఈ రెండు చర్యల వల్ల ఆర్టీసికి ఏటా వచ్చే రూ. 700 కోట్ల నష్టం పూడుతుందని సిఎం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసిని లాభాల బాట పట్టించాలని కోరారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి