సంక్షోభంలో వున్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు విద్యుత్ ఛార్జీలలో రాయితీలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వస్త్ర, ఉక్కు పరిశ్రమల యాజమాన్యాలకు, పనిచేస్తున్న కార్మికులకు ఊరటనిచ్చే దిశగా సిఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్పిన్నింగ్ మిల్లులు ప్రస్తుతం చెల్లించే యూనిట్ విద్యుత్ ఛార్జీలను రూ. 2 లకు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు యూనిట్ విద్యత్ ధరను రూ. 1.50 పై తగ్గిస్తూ సిఎం ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, అదనపు కార్యదర్శి శాంతి కుమారిలతో సిఎం ఈ మేరకు చర్చలు జరిపారు.
కాగా రాష్ట్రంలోని వివిధ స్పిన్నింగ్ మిల్లులలో దాదాపు 40 వేల మంది, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రల్లో దాదాపు 5 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు మఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏడాది కాలం పాటు అమలులో ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి