ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దండనీతి అంటే ఏమిటి ....


ధర్మరాజు : దండనీతి దండనీతి అంటారు కదా! దండం లేకుండా ప్రేమతో పనులు చేయరంటావా? ప్రజలు?
భీష్ముడు : దండం లేకుండా ఒట్టి ప్రేమతో పనులు అయిపోతాయా? సైగలతో ప్రేమతో చెబితే ఎవ్వరూ పనులు చేయరు.దండం చాలా అవసరం. దండం లేకపోతె చాలా ప్రమాదం. అది ఎలా వచ్చిందో చెబుతాను విను.

సృష్టి ఆరంభకాలంలో విష్ణుమూర్తి అత్యద్భుత దండ రూపం ధరించాడు. దండము అంటే కర్ర, దండము అంటే ఎవరు ఎలా మెలగాలో చెప్పే నీతి. ఎప్పుడూ ఈవ్యక్తి పని చేయాలి. ఈపని చేయకపోతే వేడిని రాజు ఇలా శిక్షించాలి. అని ఒక నీతిని శ్రీమహావిష్ణువు శాస్త్ర రూపంలో సృష్టించి ఇచ్చాడు. దానిని మొట్టమొదటి మనువు అయిన స్వయంభువ మనువు పాలించాడు. విష్ణువు ఇచ్చిన దండనీతి ప్రకారం ప్రజలని ఎలా పరిపాలించాలి? ఎవడు తప్పు చేస్తే శిక్ష విధించాలి? అవినీతికి ఏమి ఇవ్వాలి? హింసకి ఏమి ఇవ్వాలి? సామాన్యుడికి ఎలా ఇవ్వాలి? పెద్దవాడికి ఎలా ఇవ్వాలి? ఇవన్నీ చెప్పాడు. ఈదండమే లేకపోతె ప్రజలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. భయం లేదు కాబట్టి అక్రమాలు ఎక్కువైపోతాయి. ఎవడు పడితే వాడు విచ్చలవిడి అయిపోతాడు. అందరూ కోట్లు సంపాదించి అక్రమంగా దాచి ప్రజలందరినీ నాశనం చేసేస్తారు. కనుక సక్రమంగా సంపాదన రావడానికి, కష్టించే లక్షణం కలగడానికి, అవినీతిని తురమడానికి దండనీతి ఉండాలి. దండనీతికి శ్రీ అని, సరస్వతి అని రెండు మారుపేర్లు ఉన్నాయి. లక్ష్మి విద్య రెండు కూడా దండనీతిలో భాగాలు.

పూర్వం వసుహోముడు అనే మహారాజుగారు మాంధాత మహారాజు గారికి కనబడ్డాడు. అప్పుడు మాంధాత అయ్యా! దండనీతి ఎలా పుట్టింది? దాని విశేషాలు తెలుపండి అనగా అప్పుడు వసుహోముడు ఇలా చెప్పాడు.

సృష్టి అరంభసమయం అది. అప్పుడు బ్రహ్మ ఒక యజ్ఞం చేయాలి అనుకున్నాడు. యజ్ఞం చేయాలి అంటే ఖర్చుతో కూడుకొన్నది, మంది మార్భలంతో కూడినది. యజ్ఞం చేయాలి అనుకున్న బ్రహ్మకి యజ్ఞం చేసే ఒక ఋత్విక్కు కావలసిన అవసరం వచ్చింది. అది సృష్టి ఆరంభకాలం కనుక యజ్ఞం చేసే ఋత్విక్కు లేడు. కనుక తన చేతిలో ఉన్న కిరణాలని తన గర్భంలో నిక్షిప్తం చేశాడు. అలా గర్భం ధరించిన బ్రహ్మ వెయ్యేళ్ళు ఆగర్భాన్ని మోశాడు. స్త్రీలాగా ప్రసవించే అవకాశం లేదు కనుక హచ్చి అని ఒక తుమ్ముతుమ్మాడు. తుమ్మడంతో కడుపులో ఉన్న బిడ్డ బయటికి వచ్చాడు. తుమ్ము నుండి పుట్టాడు కనుక ఆపుట్టిన వాడికి "క్షుతుడు" అని పేరుపెట్టాడు. క్షుతము అంటే తుమ్ము. వెంటనే బ్రహ్మ "నువ్వు ఋత్విక్కుగా నాచేత యజ్ఞం చేయించు" అన్నాడు. సరేనని అక్కడి నుండి వెళ్లి ఋత్విక్కులని పిలిచి "అయ్యా మీరందరూ ఈపని చేయండి అని అడిగాడు. ఎవ్వరూ ఏపని చేయడంలేదు. కూర్చున్న చోట నుండి లేవడం లేదు. మంచినీరు తీసుకురావడం లేదు. నెయ్యి తీసుకురవడంలేదు. దర్భలు తీసుకురావడంలేదు. యజ్ఞగుండం చుట్టూ ఇటుకలు అమర్చాలి. అదీ చేయడంలేదు. రంగులతో అలంకరించాలి అదీలేదు. యజ్ఞానికి కావలసిన సామాగ్రి తేవాలి. అదీ తీసుకురావడంలేదు. ఎవ్వరూ ఏపని చేయడంలేదు. ఎవరూ ఏపని చేయడమే లేదే! అంటే ఉలుకుపలుకు లేదు. ఎందుకంటే భయం లేదు. భయపెట్టేవాడు లేడు. ఇక నావల్ల కాదని క్షుతుడు బ్రహ్మ దగ్గరికి వచ్చి ఇదేమిటయ్యా! నువ్వేమో యజ్ఞం చేయమన్నావు. ఈజనంలో ఎవడూ ఏపని చేయడంలేదు. ఇంతమంది ఋషులు ఉన్నారు. శరీరాలు పెంచుకొని బొజ్జలు పెంచుకొని శరీరాలు కదలక బద్దకంతో ఉన్నారు. వీళ్ళతో యజ్ఞం చేయించలేను అనగానే అప్పుడు బ్రహ్మ! ఓహో! వీరిని అదుపులో పెట్టడానికి విష్ణువు దండాన్ని ఒకదాన్ని సృష్టించాడు. దండనీతి లేకపోవడం వలనే వీరు మన మాట వినడంలేదు. మర్యాద నశించింది కనుక వీరిని ఏమి చేయాలి అని ఆలోచన చేసి బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థించాడు.విష్ణువు ప్రత్యక్షమై దండం ప్రస్తుతం నాదగ్గరా లేదు. శివుడు దగ్గరికి వెళదాం అని శివుడి వద్దకి వెళ్లి..

పరమేశ్వరా! బ్రహ్మ మనకి భక్తుడు, ప్రియ శిష్యుడు. మిత్రుడు. ఏమి పని మీద వచ్చాడో తెలుసుకొని పని చేసిపెట్టు అన్నాడు. అప్పుడు బ్రహ్మ! మాదగ్గర దండం ఉండేది ఒకప్పుడు. అది ఉన్నంతకాలం ఏది చెబితే అది మునులు వినేవారు. ప్రజలు వినేవారు. ఇప్పుడా దండం మాయమైపోయింది. దాంతో ఎవరు మాట వినడంలేదు.అనగా శివుడు పకపకా నవ్వి..

సృష్టిని అల్లకల్లోలం చేసే శక్తి విచ్చలవిడితనం. విచ్చలవిడితనం లేకుండా ప్రజలు అదుపులో ఉండాలి అంటే ప్రభువులు దండనీతిని అవలంభించాలి. అనగా చట్టం చేసి ఈపని చేయకపోతే శిక్ష. ఈపని చేస్తే రక్ష. ప్రతి వ్యక్తికీ కర్తవ్యం అని చెప్పే అద్భుత శాస్త్రం దండ శాస్త్రం. దండశాస్త్రాన్ని అమలు చేయడానికి ప్రక్కనే కర్ర కూడా పెట్టాలి. మాట వినకపోతే కర్రతో ఒక్కటి ఇచ్చుకోవడమే. కనుక ఈరోజు నుండి నేనే దండం. నేనే దండనీతి. అంటే దండం కర్రా తానే. దండాన్ని చేతిలో పుచ్చుకొని దండనీతిని లోకంలో అమలు చేసేవాడు తానె అయ్యాడు. ఏవిధంగా ఆరోజు నుండి మహానుభావుడైన పరమేశ్వరుడు లయకారకుడు అని పేరుపొందాడు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తూ ఉంటాడు. ఆరోజు నుండి భూలోకంలో వర్ణాశ్రమ ధర్మాలు వచ్చాయి. ఒరేయ్! నువ్వు ఈపని చెయ్ అంటే చేయాల్సిందే. నీళ్ళు కావాలి తీసుకురా అంటే తీసుకోచ్చేవాడు. కుండం పెట్టు అంటే పెట్టేవారు. ఇలా కొంతకాలానికి గుంపు అంతా ఈపని చేయండి. గుంపు అంతా ఈపని చేయండి అని గుణకర్మములు వారి సామర్థ్యమును బట్టి వారివారి చేత పనులు చేయించడం మొదలు పెట్టాడు. అప్పటి నుండి సృష్టి ఇంతబాగా నడుస్తుంది. దీనికి పరమేశ్వరుడు మూలకారకుడు. మానవులు సుఖంగా ఉండడానికి, వారివారి పనులు చేసుకోవడానికి సంపాదించుకొని ధర్మ అర్థ కామ మోక్షములు అనే నాలుగు పొందడానికి..

ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనే నాలుగు వేదాలు. శిక్ష, వ్యాకరణ, జ్యోతిష్యం, కల్పం, నిరృతం, ఛందస్సు అనే ఆరు అంగాలను(షడంగాలు), ఇవి కాకుండా పురాణం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, పూర్వోత్తర మీమాంస శాస్త్రాలు నాలుగు, వీటిని పద్నాలుగు విద్యలు అంటారు. పద్నాలుగు విద్యలతో పాటుగా వైద్యవిద్య, సంగీతం, విలువిద్య, అర్థశాస్త్రం లేక నీతిశాస్త్రం ఇవి నాలుగు ఉపవేదాంగాలు కలిపితే మొత్తం పద్దెనిమిది విద్యలు. అష్టాదశ విద్యలు పెట్టి ఒరేయ్! వీటిని నేర్చుకోండి. వీటివలన మీ కర్తవ్యాకర్తవ్యాలు తెలుస్తాయి. మీచాకచాక్యం పెరుగుతుంది. అన్నిరకాలుగా రంగాలలో ఆరితేరుతారు. ఇవన్నీ కలిస్తే లోకం అంతా సుఖంగా ఉంటుంది. కర్తవ్యాకర్తవ్యాలు తెలుస్తాయి. అని మొత్తం పదునెనిమిది విద్యలు లోకానికి ఇచ్చాడు.

దండనీతితో! నిన్ను వేదం చదవమన్నా! చదవ్వేం? చదువు లేదా శిక్షిస్తాను. నీకు సంగీతం పాడడం అలవాటు కదా! ఎందుకు మానేశావు? సంగీతం పాడు. ఇదిగో నువ్వు కల్పం, నువ్వు జ్యోతిష్యం, నేర్చుకో.. అదికూడా వారికి పుట్టుకతో కాదు. వారికి దానిమీద ఉన్న ఆసక్తి వల్ల.. ఒక్కొక్కడు పుట్టి పుట్టగానే సంగీతం పడతాడు. మరొకడు డప్పు వాయిస్తాడు. వారికి పొరబాటున ఏదైనా నేర్పిస్తే రాదు. కర్మకాలి వేరేదేదైనా నేర్చుకున్నా రాణించలేరు. మనసంతా పుట్టుకతో వచ్చినదానిమీద ఉంటుంది. అంటే వాడికి శాస్త్రం మీద ఆసక్తి ఉంది. ఎవరికీ దేనిమీద ఆసక్తి ఉందొ దానిని ఎరిగి అందులోనే వాడికి నైపుణ్యం వచ్చేలా చేసే శక్తికి దండనీతి అని పేరు. దండనీతిని శివుడు చాలాకాలం మహారాజుల ద్వారా అమలు చేయించాడు.


విన్నావు కదా ధర్మరాజ! దండనీతిని అమలు చేస్తే రాజ్యం బావుంటుంది. పిచ్చపిచ్చ కింద ఉంటె ఎవడు ఎందులో ఉండాలో తెలియకపోతే ప్రమాదం అన్నాడు.

courtesy:Bright Thinkers Whatapp Group

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.