తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవం సందర్బంగా కే సీ ఆర్ ఇచ్చిన ప్రసంగం .
రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరులకు నివాళులు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇంత ఘనంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
భారత స్వాతంత్రోద్యమమే స్పూర్తిగా, దశాబ్ద కాలానికి పైగా అహింసాయుతంగా, శాంతియుత పంథాలో సాగించిన మన పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగాం. ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతంలోనే మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వచ్చింది. మన నిధులు, నీళ్లు, ఉద్యోగాలు దోపిడీకి గురయ్యాయి. అందుకే నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఉద్యమం సాగించి రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏయే అవరోధాలను ఎదుర్కొన్నదో, ఏయే బాలారిష్టాలను అధిగమించిందో గతంలో నేను ఎన్నో సార్లు వివరించాను. తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయనే ప్రజల విశ్వాసాన్ని ఈ రెండేళ్ల పాలన నిలబెట్టింది. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతి వృత్తంగా పరిపాలన సాగుతున్నది. మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమలు చేసుకుంటున్నాం. మాత్రమే కాక ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తించి ప్రకటించని ప్రజోపయోగ కార్యక్రమాలు అమలు చేసుకోగలుగుతున్నాము. అందువల్లనే ఇది మన ప్రభుత్వం అన్న భావన ప్రతీ ఒక్క తెలంగాణ పౌరుడిలో పాదుకొన్నది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మనం ఎంత బలమైన పునాది వేయగలిగితే రాబోయే తరతరాల వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. అందుకే మూస విధానాలను సమూలంగా మార్చివేసి ప్రజలకు పారదర్శకంగా, న్యాయబద్ధంగా సుపరిపాలన అందిచే దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి.
మన నిధులు మనకే
-------------------------
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో మన నిధులు ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం లేకుండా పోయింది. సమైక్య పాలనలో ప్రతీ రూపాయికి తెలంగాణ భిక్షమెత్తుకునే దుస్థితి ఉండేది. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమనే అహంకారపూరిత మాటలు కూడా భరించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మనం మన చరిత్రను తిరగరాసుకుంటున్నాం. బంగారు తెలంగాణ నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళికతో స్థిరంగా పురోగమిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఆర్థిక వనరుల విషయంలో మనకు ఓ స్పష్టమైన అంచనా లేదు. అస్పష్టతల నడుమ మొదటి రెండు బడ్జెట్లు రూపొందించాల్సి వచ్చింది. 2015 ఏప్రిల్ నుంచి 2016 మార్చి వరకు ఓ పూర్తి ఆర్థిక సంవత్సరం గడిచిన తర్వాతనే రాష్ట్రం సమగ్ర ఆర్థిక స్వరూపం అవగతమైంది. ఆయా శాఖల్లో మనకు వస్తున్న ఆదాయమెంత? ఖర్చవుతున్నదెంత? అమలవుతున్న పథకాలు ఏమిటి? సాధిస్తున్న ఫలితాలు ఏమిటి? అనే విషయాన్ని కూలంకషంగా సమీక్షించగలిగాం. సమీక్షలు, నిరంతర అధ్యయనం తర్వాత 2016-17 సంవత్సరానికి ఒక లక్షా ముప్పయి వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశ పెట్టుకోగలిగాం. ఇందులో ప్రణాళికేతర వ్యయం కంటే ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉండడం అపూర్వం. వనరులను బలోపేతం చేసి, వ్యయాన్ని సహేతుకంగా క్రమబద్ధీకరించడం ద్వారా ఇది సాధ్యమైంది.

పేదల సంక్షేమం
----------------------
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజల జీవితం కకావికలమైంది. దీంతో ప్రజలు తమ కనీస అవసరాల కోసం కూడా కొట్టుమిట్టాడవల్సిన దుర్గతి సంభవించింది. ముందు ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ప్రభుత్వం సంక్షేమ రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. బడుగు, బలహీన వర్గాలకు ఏ అండదండా లేని అన్నార్తులకు మానవీయ దృక్పథంతో ఆసరా పెన్షన్లను అందిస్తున్నది. అసహాయుల కనీస అవసరాలు తీరేందుకు అనువుగా ప్రభుత్వం పించన్లు పెంచింది. పెరిగిన పించన్లతో వృద్దులు, వితంతువులు, వికలాంగులతో పాటు ఆధారం లేని ఎంతో మంది అభాగ్యులు తమ బ్రతుకుకు ఒక భరోసా దొరికిందనే ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో జీవించగలుగుతున్నారు. పేదింటి ఆడపిల్ల పెండ్లి భారాన్ని పంచుకోవాలనే మంచి ఉద్దేశ్యంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ కార్యక్రమం ప్రవేశ పెట్టింది. ఈ పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో గుండె ధైర్యాన్ని ఇచ్చింది. తొలిదశలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకే పరిమితం చేసిన ఈ పథకాన్నిఇప్పుడు బిసిలు, ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాల పేదలకు కూడా వర్తింపచేస్తున్నాం. పెండ్లికి పది రోజుల ముందే 51వేల రూపాయలు ఆడపిల్ల తల్లి పేరున చెక్కు ఇవ్వాలని కూడా సూచనలిచ్చాము. 18 సంవత్సరాల వయస్సు నిండిన వారికే ఈ పథకం ఉద్దేశించింది కావడంతోఈ పథకం ప్రయోజనాలు అందుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేయడం లేదనే సమాచారం సంతోషం కలిగిస్తున్నది. పేదల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఈ పథకం అదనంగా సామాజిక సంస్కరణకు కూడా తోడ్పడడం ఆనందంగా ఉన్నది.

6 కిలోల బియ్యం/ సన్నబియ్యం
---------------------------------------
ఏ సమాజంలో అయినా సరే.. మనుషులు తినడానికి తిండిలేక మరణిస్తే ఆ సమాజానికి అది అత్యంత అవమానకరం. సమైక్య పాలనలో తెలంగాణలో ప్రజలు తరచుగా ఆకలి చావులకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు ఆకలికి అలమటించవద్దని, ఏ కుటుంబం ఏ ఒక్క పూట కూడా పస్తులుండే పరిస్థితి రావద్దని ప్రభుత్వం తలంచింది. ప్రతీ కుటుంబం ఆహార అవసరాలకు సరిపోయినంతగా బియ్యం అందించి తీరాలని రేషన్ బియ్యం కోటా పెంచింది. గతంలో ఒక్కొక్కరికి కేవలం నాలుగు కిలోల బియ్యం మాత్రమే ఇస్తే తెలంగాణలో 6 కిలోలు ఇచ్చుకుంటున్నాం. గతంలో కుటుంబంలో గరిష్టంగా ఐదుగురికి మాత్రమే బియ్యం ఇవ్వాలనే పరిమితి ఉండేది. ఇప్పుడు ఆ అర్థపర్థంలేని పరిమితి తొలగించాం.కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అంతమందికి 6కిలోల చొప్పున బియ్యం ఇచ్చుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో 2.82 కోట్ల మందికి 1.77 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించుకోగలుగుతున్నాం. బావి భారత పౌరులు చదువుకునే ప్రభుత్వ హాస్టళ్ళలో, పాఠశాలల్లో మద్యాహ్న భోజన పథకానికి గతంలో నాసిరకం బియ్యం సరఫరా అయ్యేవి. ఆకలిని చంపుకోలేక, పురుగులు పట్టిన దొడ్డుబియ్యం తినలేక ఆనాడు విద్యార్థినీ విద్యార్థులు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాఠశాలల్లోని మద్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా అవుతున్నాయి. గతంలో పసిపిల్లలు తినే తిండిని కూడా గ్రాముల చొప్పున లెక్కగట్టి కొలతలు నిర్ణయించే దుర్మార్గపు పద్దతి అమల్లో ఉండేది. మన ప్రభుత్వం ఈ అమానవీయ పద్ధతిని రద్దు చేసింది. పసిపిల్లలకు పట్టినంత అన్నం పెట్టమని ఆదేశాలిచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా సన్నబియ్యం సరఫరా చేయబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను.

అమర వీరుల కుటుంబాలకు ఉద్యోగం
-----------------------------------------------
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగం చిరస్మరణీయమైనది. అమరుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రభుత్వం పది లక్షల రూపాయలు అందిస్తున్నది. అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని టిఆర్ఎస్ తన మానిఫెస్టోలో ప్రకటించింది. ఆ మాట ప్రకారమే ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 598 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తున్నాం.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
-------------------------------
పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. గత ఏడాది 65వేల ఇండ్లను, ఈ ఏడాది రెండు లక్షల ఇండ్లను మంజూరు చేశాము. హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్లు, జిల్లాల్లో లక్ష ఇండ్లు నిర్మిస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో జర్నలిస్టు సోదరుల కోసం హైదరాబాద్ లో ప్రత్యేక కాలనీ నిర్మించాలని నిర్ణయించాం. దశల వారీగా మిగతా చోట్ల కూడా నిర్మిస్తాం. జర్నలిస్టులు, హోంగార్డులు, భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. వ్యవసాయాధారిత దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ లాంటి కార్యక్రమాలెన్నో అమలు చేస్తూ సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది.

విద్యుత్
----------
సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోతలతో, బిల్లుల మోతలతో విసిగి వేసారిన తెలంగాణ రైతు తిరగబడి అసెంబ్లీ ముట్టడికి పూనుకుంటే ఆనాటి ప్రభుత్వం రైతుల గుండెల్లో తుపాకి తూటాలు దించింది. ఆ రక్తంలో నుంచే తెలంగాణ జెండా ఎగిసిపడింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిడికిళ్లు బిగుసుకున్నయి. తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు తీరతాయనే ప్రజల ఆశలు నేడు నెరవేరినాయి. కారుచీకట్లు తొలగిపోయి వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కృతమైంది. రాష్ట్రం ఏర్పడిన 5వ నెల నుంచే కోతల్లేని విద్యుత్ అందించుకోగలుగుతున్నాం. కరెంటు కోతలకు కాలం చెల్లి... జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అవసరం లేని దశకు నేడు తెలంగాణ చేరింది. విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచుకునేందుకు కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది. రాబోయే మూడేళ్లలో 24వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక తెలంగాణలో విద్యుత్ కోతలుండవు. రెప్పపాటు కూడా కరెంటు పోదు. త్వరలో వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల కరెంటు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు వస్తుందనే మాట అక్షర సత్యమని ప్రభుత్వం నిరూపించింది.

మిషన్ భగీరథ
------------------
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న మిషన్ భగీరథ పథకం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది. దేశ ప్రధాని నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల దాకా ఈ పథకం ఎంతో ఉదాత్తమైనదని గుర్తించి ప్రశంసిస్తున్నారు. తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం పడుతున్నపాట్లు చూసి, ఎట్లయినా ఈ పరిస్థితిని మార్చాలని పడిన ఆరాటం నుంచి పుట్టిన ఆలోచననే మిషన్ భగీరథ. సమైక్య పాలనలో గొంతు తడిపే గుక్కెడు నీళ్ల కోసం తెలంగాణ గుక్కపట్టి ఏడ్చింది. తెలంగాణ ఆడబిడ్డలు బిందెడు నీళ్ల కోసం మైళ్లకొద్దీ నడవాల్సిన దుస్థితి. స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోక ఫ్లోరైడ్ బారిన పడి నల్గొండ ప్రజలు పడుతున్న నరకబాధకు ఏ ప్రభుత్వమూ పరిష్కారం చూపలేదు. అందుకే ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్చమైన నదీ జలాలను తాగునీరుగా అందించడం ప్రథమ కర్తవ్యంగా భావించాం. వచ్చే ఎన్నికల సమయం వరకు ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని మంచినీళ్ల కోసం వీధుల్లో తిరగాల్సిన అగత్యం లేకుండా చేస్తామని నిండు శాసనసభలో సాహసోపేత ప్రకటన చేశాము. దానికి అనుగుణంగా మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 6100 గ్రామాల్లో నీళ్లు అందుతాయి. వచ్చే ఏడాది చివరి నాటికి 90 శాతం గ్రామాల్లో శుద్ది చేసిన నీటి సరఫరా జరుగుతుంది. మిగతా ప్రాంతాలకు 2018లో అందుతాయి.

నీటి పారుదల ప్రాజెక్టులు
-------------------------------
మాటకు మంత్ర శక్తిని, మనిషికి జీవశక్తిని ఇచ్చేది నీళ్లే. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు పేర్కొన్నట్లు తెలంగాణ ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కలేదు. గోదావరి, కృష్ణా జీవనదులు... వాటి ఉపనదులు... కాకతీయుల కాలం నుంచి నీటి ఆదెరువులుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు... ఎన్ని ఉన్నా ఏమీ లేని గతిని తెలంగాణ అనుభవించింది. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు 1330 టిఎంసిల నీటి వాటా ఉన్నా, ఈ నీటిని వాడుకునే ప్రాజెక్టులు లేవు. తెలంగాణ ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం చేశారు. నీటిని ఆంధ్రకు తరలించడానికి సమైక్య పాలకులు అనేక అక్రమాలకు ఒడిగట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కోసం తలపెట్టిన ప్రాజెక్టులు ఉద్దేశపూర్వకంగా వివాదాల్లో చిక్కుకునే విధంగానే డిజైన్ చేశారు. అంతర్రాష్ట్ర వివాదాలు, పర్యావరణ సమస్యలు చుట్టుముట్టేలా చేసి అవి ఏనాటికీ ముందట పడకుండా చేశారు. అందుకే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టాం. తెలంగాణ భౌగోళిక స్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నదీ మార్గాలను సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని, నీటి లభ్యత విషయంలో సంపూర్ణమైన అవగాహనకు వచ్చి, కొన్ని నెలల పాటు స్వయంగా నేనే పూనుకుని శోధించి, మదించి, నిపుణులతో చర్చించి, కోటి ఎకరాలకు సాగునీరు అందే విధంగా ప్రాజెక్టుల రీ డిజైన్ చేశాము. ప్రాజెక్టుల తీరు తెన్నులు ప్రజలకు స్పష్ట పరచాలని ఇటీవలే నేను శాసనసభలో స్వయంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా చేశాను. అది టీవీల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా వీక్షించారు. ప్రభుత్వం యొక్క దీక్షాదక్షతలను అభినందించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తూ, మన ప్రాజెక్టులకు గల అవరోధాలన్నింటినీ విజయవంతంగా అధిగమిస్తున్నాం. ఇందులో భాగంగా గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వివాదాలు పరిష్కరించుకున్నాం. చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాం. కృష్ణానదిపై తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరిని సాధించాం. మహారాష్ట్ర,కర్ణాటక ప్రభుత్వాల నుంచి ఆశించిన సహకారం అందుతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నది. ఇక ఎవరి ఆటలు సాగనివ్వం. కృష్ణ, గోదావరి జలాల్లో మన వాటా నీరు చుక్క కూడా వదిలే సమస్య లేదు. ప్రతీ నీటి బొట్టును తెలంగాణ భూముల్ని తడిపేందుకు వినియోగిస్తాం. తెలంగాణ ప్రాంతం ఓ భిన్నమైన భౌగోళిక స్థితిలో ఉన్నది. సముద్ర మట్టానికి కృష్ణా నది 200 మీటర్ల ఎత్తులో ఉంటే, గోదావరి వంద మీటర్ల ఎత్తులో ఉంది. తెలంగాణ ప్రాంతమంతా ఇంత కంటే చాలా రెట్ల ఎత్తులో ఉన్నది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కూడా రెండేళ్ల కోసారి ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితులు వచ్చే విధంగా ఉన్నాయి. ఈ విషయాన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టుల రీ డిజైనింగ్ జరిగింది. వరుసగా రెండేళ్లు కరువు వచ్చినా సరే రైతులు నీటికోసం ఇబ్బంది పడకుండా ఉండే విధంగా జల విధానం రూపొందించాం. దాని ప్రకారమే ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేశాం. ఇప్పటికే అటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. 2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ, ప్రాణహిత ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తాయి. తర్వాత రెండేళ్లలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పంట కాల్వలు, ఇతర నిర్మాణాలు కూడా పూర్తవుతాయి. దాదాపు 2022 వరకు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు పూర్తవుతాయి.

ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు
------------------------------
మరో వైపు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా,కోయిల్ సాగర్ ప్రాజెక్టులు 2017 వరకు వందశాతం పూర్తవుతాయి. ఈ ఖరీఫ్ కే కల్వకుర్తి ద్వారా 1.5 లక్షలు, నెట్టెంపాడు ద్వారా 1.5 లక్షలు, బీమా ద్వారా 1.4 లక్షలు, కోయిల్ సాగర్ ద్వారా 20వేల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం. ఆదిలాబాద్ లోని కొమురం భీమ్ ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్ లో 25 వేల ఎకరాలకు, నీల్వాయి ప్రాజెక్టు ద్వారా 6వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. 2017 నాటికి ఆదిలాబాద్ జిల్లాలోని కొమురం భీమ్, నీల్వాయి, జగన్నాథపురం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. ఖమ్మం జిల్లాలోని డిబిఎం -60 భక్త రామదాసు ప్రాజెక్టును ఈ ఆగస్టు నాటికే పూర్తి చేసి పాలేరు, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలను సస్యశ్యామలం చేస్తాం. కరీంనగర్ మిడ్ మానేరులో ఈ ఏడాది వర్షాకాలంలోనే మూడు టిఎంసిలు నిల్వచేసి, ఎల్ఎండి ద్వారా ఎస్ఆర్ఎస్పి కాల్వలకు నీరు వదులుతాం. ఎల్లంపల్లిలో కూడా ఈ ఖరీఫ్ లో 148 మీటర్ల మేర, 20 టిఎంసిల నీటిని నిల్వ చేస్తాం. దానివల్ల హైదరాబాద్ కు మంచినీటి సరఫరా నిరంతరాయంగా సాగుతుంది. దీని ద్వారానే ఆదిలాబాద్ కడెం ప్రాజెక్టులోని 30వేల ఎకరాల మేర చివరి ఆయకట్టుకు నీరందిస్తాం. మంథని లిప్టు ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఈ ఖరీఫ్ కే పది వేల ఎకరాలకు నీరందబోతున్నది. 130 కోట్ల రూపాయలతో కాకతీయ కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తున్నాం. దీనివల్ల ఎస్ఆర్ఎస్ పి స్టేజ్ 1లో 9 లక్షల ఎకరాలకు, స్టేజ్ 2లో 2.4 లక్షల ఎకరాలకు ఈ ఏడాదే సాగునీరు అందుతుంది. మెదక్ సింగూరు ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్ లోనే 40వేల ఎకరాలకు, ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి, కాల్వల ఆధునికీరణ పనులు పూర్తి చేస్తున్నాం. ఘనపూర్ ఆనకట్ట ద్వారా 25 వేల ఎకరాలకు నీరు అందిస్తాం.

మిషన్ కాకతీయ
---------------------
కాకతీయుల కాలం నుంచి నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణలో అత్యధిక భూమి సాగయ్యేది. వ్యవసాయం బాగుండడంతో గ్రామీణ ప్రాంతాలు కళకళలాడుతూ ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో ఇతర రంగాలతో పాటు చెరువులను కూడా పాలకులు తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. కొన్ని చెరువులు దురాక్రమణకు గురై నామరూపాల్లేకుండా పోయినయి. మరికొన్ని పూడుకుపోయి నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. గట్లు సరిగా లేవు. కాల్వలు లేవు. తూముల్లో నీరు పారకం నిలిచిపోయింది. చెరువులలో చెట్లు మొలిచి చిట్టడవిలా మారాయి. ఫలితంగా వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతిని రైతులు అప్పుల పాలయ్యారు. అసలు సమస్య మూలాలను వెతకకుండా పైపై చర్యల వల్ల ఫలితం ఉండదు. సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. అందుకే మిషన్ కాకతీయ పథకం రూపొందించి చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నాం. రైతులు, వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో, సహకారంతో మిషన్ కాకతీయ తొలిదశ కార్యక్రమంలో భాగంగా ఎనిమిది వేల చెరువులను పునరుద్ధరించాం. రెండో దశలో మరో 9వేల చెరువుల పనులు చేస్తున్నాం.

రహదారులు
----------------
రాష్ట్ర జనాభాలో సగభాగం ప్రతీ రోజు రోడ్లమీదే ప్రయాణం చేస్తుంటారు. తెలంగాణ వచ్చే నాటికి రోడ్ల పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది. గుంతలు పడి, రాళ్లు తేలిన రోడ్లు నరకానికి నకళ్లుగా మారినయ్. రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది మరణిస్తున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సమగ్ర రహదారుల విధానం రూపొందించుకున్నాం. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రానికి ఖచ్చితంగా నాలుగు లేన్ల రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి రెండు లేన్ల రోడ్డు, మండల కేంద్రం నుంచి ప్రతీ గ్రామానికి బస్సులు తిరిగే విధంగా మంచి రహదారి ఉండాలని విధానం పెట్టుకున్నాం. అటు ఆర్ అండ్ బి, ఇటు పంచాయిత్ రాజ్ రోడ్లకు కావాల్సినన్ని నిధులు ఇచ్చి కొత్త రహదారుల నిర్మాణం, విస్తరణ, పాతరోడ్ల మరమ్మతు పనులు చేపట్టినం. కేవలం రెండేళ్లలోనే తెలంగాణలో రహదారులు బాగుపడినాయి. గత ఏడాది 4,500 కిలో మీటర్ల మేర ఆర్ అండ్ బి రహదారులను తీర్చిదిద్దినం. ఈ ఏడాది మరో 7,500 కిలో మీటర్ల రహదారుల పనులు చేస్తున్నాం. పంచాయితీ రాజ్ శాఖ పరిధిలో కూడా గత ఏడాది 3,387 కిలోమీటర్లు, ఈ ఏడాది 4,252 కిలోమీటర్ల రహదారుల పనులు చేపట్టినం. దాదాపు 150 కొత్త బ్రిడ్జిలు నిర్మించినం. ఈ రెండు శాఖల పరిధిలో ఇప్పటి దాకా దాదాపు పదివేల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ర్టంలో అద్దం లాంటిరోడ్లు నిర్మిస్తున్నం.

జాతీయ రహదారులు
---------------------------
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జాతీయ రహదారుల విషయంలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. తెలంగాణ ఏర్పడక ముందు మన పది జిల్లాల్లో కేవలం 2,573 కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉంది. అదే ఆంధ్ర ప్రాంతంలో 6,200 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ఉంది. జాతీయ రహదారుల విషయంలో జాతీయ సగటు 3.06 అయితే, తెలంగాణ సగటు కేవలం 2.4 మాత్రమే ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంపై వత్తిడీ తెచ్చి, ఇక్కడి అవసరాలను ఒకటికి పదిసార్లు నొక్కి చెప్పి, ప్రధానిని, కేంద్ర మంత్రిని కలిసి కొత్త జాతీయ రహదారులను సాధించాం. కేవలం రెండేళ్ల కాలంలో తెలంగాణకు 1900 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరయ్యాయి. వీటితో మన తెలంగాణ జాతీయ రహదారుల సగటు కూడా 3.7కు చేరుకుని జాతీయ సగటు సరసన నిలబడగలిగింది. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తున్నది. దీనికి తోడు భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్, చేవెళ్ల, శంకరపల్లి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్ పూర్ మీదుగా మరో రీజనల్ రింగు రోడ్డు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశాం.

సంపూర్ణ అక్షరాస్యత
--------------------------
ఏదైనా విషయం ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవాలి. సిగ్గు పడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నామో తెలిస్తేనే ఎక్కడికి పోవాలో తెలుస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా కనీసం అందరూ అక్షరాస్యులు కూడ కాలేకపోవడం ఓ దౌర్భాగ్యం. గత పాలకులు ఈ విషయంలో కూడా దృష్టి పెట్టలేదు. అక్షరాస్యతలో దేశ సగటు 72 శాతం అయితే, తెలంగాణలో కేవలం 67శాతమే ఉంది. ఎస్సీ, ఎస్టీలు, మహిళల్లో మరింత తక్కువ శాతం అక్షరాస్యత ఉంది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు అక్షరాస్యతలో ఎక్కువ వెనుకబడి ఉన్నాయి. మన కన్నాచిన్నరాష్ట్రాలు అక్షరాస్యతలో ముందుండగా గత పాలకుల నిర్వాకం వల్ల తెలంగాణ వెనుకబడి పోయింది. వందశాతం అక్షరాస్యత సాధించడాన్ని ఓ సవాల్ గా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ప్రత్యేక కార్యక్రమం రూపొందించుకునకున్నది. అనతి కాలంలోనే రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించితీరుతామని సవినయంగా తెలియచేస్తున్నాను.

250 రెసిడెన్షియల్ స్కూళ్లు
--------------------------------
విద్యా రంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. పేద ప్రజలు ఎక్కువగా ఉండే మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పటిష్ట పరచాలని ప్రభుత్వం భావిస్తున్నది. రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా డ్రాపవుట్ల సంఖ్యను నియంత్రించ వచ్చు. నాణ్యమైన విద్య, మంచి ఆహారం ప్రభుత్వమే సమకూరిస్తే పేద పిల్లలు నిరందిగా చదువుకుంటారు. అందుకే ఎస్సీలకు 130, ఎస్టీలకు 50, మైనారిటీలకు 70... వీటిలో 30 రెసిడెన్షియల్ కాలేజీలతో పాటు మొత్తం 250 రెసిడెన్షియల్ స్కూళ్లను ఈ ఏడాది నుండే ప్రారంభిస్తున్నాం. మానిఫెస్టోలో ప్రకటించిన కెజి టు పిజి ఉచిత విద్య విధానాన్ని అమలు పరిచే దిశలో ఇది తొలి అడుగు. పేద విద్యార్థులకు చదువుకునే హక్కును కల్పించాలనే రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రం వేస్తున్న ముందడుగు. ఇది భారతరత్నడాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఆ మహనీయుని అర్పిస్తున్న నిజమైన నివాళి. ఇదే సందర్భంలో ఆయన స్పూర్తిని బావి తరాలకు మహోన్నతంగా చాటాలి. అందుకే 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ తీరాన సమున్నతంగా ప్రతిష్టించాలని ప్రభుత్వం సంకల్పించింది.

వైద్యం
----------
ఆధునిక కాలంలో వైద్యశాస్త్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వాసుపత్రులు కునారిల్లిపోవడంతో నిరుపేదలకు కనీస వైద్యానికి కూడా దిక్కులేకుండా పోయింది. ధర్మాసుపత్రులను నెలకొల్పడంలో నిజాం రాజులు కనబరిచిన స్పూర్తిని కూడా తర్వాతి ప్రభుత్వాలు చూపించలేకపోయాయి. కలిగిన వారికి ఖరీదైన చికిత్స అందించే ప్రైవేటు హాస్పిటళ్లు విస్తరించినంతగా, పేదల అనారోగ్య బాధలను అరుసుకునే సర్కారు దవాఖానాలు పెరగలేదు. ఉన్న దవాఖానల పరిస్థితి చూస్తే శిథిలావస్థలో భవనాలు, చిలుం పట్టిన మంచాలు, చినిగిపోయిన పరుపులు, చీకిపోయిన బెడ్ షీట్లు, పురాతన పరికరాలతో వైద్యం కోసం వచ్చిన రోగికి కొత్త రోగాలు అంటించే విధంగా తయారైనాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ప్రజలు పాటలు పాడుకునే స్థాయికి పరిస్థితి దిగజారింది. ఇది గమనించిన ప్రభుత్వం సర్కారీ వైద్యానికి సోకిన రుగ్మతలు తొలగించేందుకు సత్వర చర్యలు ప్రారంభించింది. మొట్టమొదట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానల్లో కొత్త మంచాలు, కొత్త బెడ్లు, బెడ్ షీట్లు సమకూర్చేందుకు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని హాస్పిటళ్లలో కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఏరియా హాస్పిటళ్లలో కొత్త బెడ్లు, బెడ్ షీట్లు వచ్చాయి. రోజుకో రంగు చొప్పున బెడ్ షీట్ వేయాలని నిర్ణయించాం. పి.హెచ్.సి నుంచి పెద్దాసుపత్రుల వరకు ఒక బెడ్ నిర్వహణ కోసం నెలకు సగటున 6,000 రూపాయలుగా లెక్కగట్టి ఖర్చు చేస్తున్నాం. మన జనాభాకు అనుగుణంగా ఆసుపత్రుల సంఖ్య పెరగలేదు కనుక అత్యాధునిక సౌకర్యాలు కలిగిన మల్టీ స్పెషల్ హాస్పిటళ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో మరో నాలుగు పెద్ద హాస్పిటళ్లతో పాటు, రాష్ట్రంలో మరో మూడు చోట్ల కొత్త హాస్పిటళ్లు నిర్మించబోతున్నది. జిల్లాకు నాలుగు చొప్పున డయాలసిస్, ఐసియులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్ధిపేట లో కొత్తగా మూడు ఐసియులు ఏర్పాటు చేసినం. ప్రభుత్వ హాస్పిటళ్లు తగిన విధంగా అభివృద్ధి చెందకపోవడంతో పేదలు రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేటు సంస్థలను ఆశ్రయించవలసి వస్తున్నది. అందుకోసం భారీ మొత్తం చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండవద్దని ప్రభుత్వాసుపత్రుల్లో సిటి స్కాన్, ఎంఆర్ఐ, మామ్మో గ్రామ్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ లాంటి అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. చికిత్స పొందుతూ మరణించిన వారిని ఇంటికి ఉచితంగా చేర్చేందుకు అంబులెన్సులను కూడా ఏర్పాటు చేస్తున్నాం.

గుడుంబా నియంత్రణ
----------------------------
ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలంటే కేవలం వైద్యశాలలు నిర్మించడంతోనే బాధ్యత తీరిపోదు. ప్రజలలో తమ ఆరోగ్యం పట్ల తగిన స్పృహను, చైతన్యాన్ని పెంపొందింప చేయాలి. దుర్వ్యసనాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోకుండా చూడాలి. రాష్ట్రంలో గుడుంబా పేద ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిన యువతరం గుడుంబా వల్ల అర్థాయుష్కులై మరణిస్తున్నారు. ఈ వైపరీత్యాన్ని అడ్డుకొని తీరాలని ప్రభుత్వం పట్టుదలతో ప్రయత్నించింది. గుడుంబా తయారు చేసే వారిని శిక్షించడం కాకుండా, వారికి జీవనోపాధి మార్గం చూపించడంపై దృష్టి సారించింది. ఈ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గుడుంబా తయారు చేసేవారు ఆ పనిని వదిలిపెడుతున్నారు. రాష్ట్రంలో గుడుంబా తయారీ, అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి.

పరిశ్రమలు
---------------
రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు పారిశ్రామికాభివృద్ధి ఎంతో కీలకం. ఉన్న పరిశ్రమలను సుస్థిరం చేయడంతోపాటు కొత్త పరిశ్రమలను ఆకర్షించే విధంగా నూతన పారిశ్రామిక విధానం టిఎస్ ఐపాస్ ను రూపొందించుకున్నాం. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చే వారికి కావాల్సిన అన్ని అనుమతులు ఒకే చోట కేవలం 15రోజుల వ్యవధిలో లభించేలా సింగిల్ విండ్ విధానం ప్రవేశ పెట్టాం. ఈ విధానానికి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. పారిశ్రామిక వేత్తలు మన రాష్ట్రానికి రావడానికి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ మనదగ్గర కావాల్సినంత ఉంది. విద్యుత్ సరఫరా మెరుగుపర్చడంతో పారిశ్రామిక వేత్తల్లో విశ్వాసం మరింత పెరిగింది. సింగిల్ విండో విధానం ద్వారా ఇప్పటికే 1798 పరిశ్రమలు, 24,698 కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి తరలివచ్చాయి. వీటి వల్ల లక్షా 11 వేల మందికి ఇప్పటిదాకా ఉద్యోగావకాశం కలిగింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా జిల్లాలలో సైతం పరిశ్రమల స్థాపన జరగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వరంగల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్ పార్కు కోసం వెయ్యికి పైగా ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ ఫేజ్ 1 కోసం 6,500 ఎకరాలు సేకరించి సిద్దం చేశాము.

ఐటి
------
ఐటి రంగంలో తెలంగాణ సంచలనాలు సృష్టిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే తెలంగాణలో 1300 ఐటి యూనిట్లు ఏర్పాటయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో 68,258 కోట్ల రూపాయల విలువ చేసే ఐటి సేవలతో దేశంలోనే నెంబర్ వన్ గా మన తెలంగాణ నిలించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, ఒరాకిల్ లాంటి అనేక సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించాయి. దేశంలోని దిగ్గజ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, టిసిఎస్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నాయి. ఐటి రంగంలో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఒక ప్రధాన ఆకర్షణ కేంద్రంగా నిలవాలనే లక్ష్యంతో ఇటీవలే నూతన ఐటి పాలసీని ప్రకటించాం. ఈ పాలసీ ప్రకటించిన రోజే పలు కంపెనీలు మన రాష్ట్రంలో తమ సంస్థలు ప్రారంభించడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయంటే మన పాలసీ పెట్టుబడిదారులను ఎంతగా ఆకర్షిస్తుందో వేరే చెప్పనవసరం లేదు. ఐటి రంగాన్ని కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరింపచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. హైదరాబాద్ లో స్టార్టప్ కంపెనీల కోసం ఏర్పాటు చేసిన టి-హబ్ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. విఖ్యాత ఐటి దిగ్గజం ఆపిల్ తన టెక్నాలజీ మాపింగ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే.

హరితహారం
---------------
రాష్ట్రంలో పచ్చదనం హరించుకుపోవడంతో తరచుగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అడవులు కుంచించుకుపోయి చెట్లు నరికివేతకు గురికావడానికి కరువు కాటకాలు రావడానికి మధ్య సంబంధాన్ని అందరూ గుర్తిస్తున్నారు. తమ ఆవాసాలు చెదిరిపోవడంతో కోతులు తదితర వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. పర్యావరణ సమతుల్యం ఉండాలంటే 33 శాతం అడవులు, పచ్చదనం ఉండాలి. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో 23 శాతం మాత్రమే ఉంది. ఒకనాడు అడుగడుగునా చెట్లతో, దట్టమైన అడవులతో ఉన్న తెలంగాణ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు, మళ్లీ నిండుగా వానలు కురిసేందుకు వీలుగా తెలంగాణకు హరితహారం అనే ఒక అద్భుతమైన పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. వానలు వాపస్ రావాలె – కోతులు వాపస్ పోవాలి అనే నినాదమిచ్చి ఊరూ వాడా పిల్లా పెద్దా అందరినీ భాగస్వాములుగా చేసి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మొక్కల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని, హైదరాబాద్ నగరంలో మరో 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మూడేళ్ళ కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటి ఆకుపచ్చని తెలంగాణ సాధించే దిశగా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. వచ్చే జూలైలో జరిగే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యం నెరవేరే విధంగా ఉద్యమ స్పూర్తితో ఎక్కడికక్కడ విరివిగా మొక్కలు నాటాలి అని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.

సాదాబైనామా/పౌతీ/అసైన్డ్ భూములు
----------------------------------------------
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం బక్క రైతులకు బంగారు కానుకను ఇచ్చింది. భూ రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల సామాన్య రైతులు పడే ఇక్కట్లు తొలగించడానికి భూ పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చింది. సాదాబైనామాల మీద జరిగిన భూమి అమ్మకాలు, కొనుగోళ్ళను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల లోపు సాదాబైనామాల మీద జరిగిన లావాదేవీలకు ఆర్ఓఆర్ చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ఈ రోజు నుంచి జూన్ పదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాని కోరుతున్నాను. మ్యుటేషన్లలో కూడా విపరీతమైన జాప్యాన్ని నివారించేందుకు, పారదర్శకతతను పెంచేందుకు, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు నిర్ణీత కాల వ్యవధిలో పేరు మార్పిడీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారసత్వంగా వచ్చిన భూముల పేరు మార్పిడీ దరఖాస్తు చేసిన పది రోజుల్లో, ఇతరత్రా రిజిస్ట్రేషన్ అయిన భూముల పేరు మార్పిడీ పది హేను రోజుల్లో జరగాలని విధాన నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న కమతాలను సాగు చేసుకుంటున్నారు. దీనివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. చిన్న కమతాలన్నీ ఒకే చోట చేర్చేందుకు కమతాల ఏకీకరణ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేకపోయిన సంస్కరణలు చేసి ఈ ప్రభుత్వం సామాన్య రైతుల సమస్యల పరిష్కారం పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నది.

అసైన్డ్ భూములు
---------------------
నిరుపేద వ్యవసాయాధారిత కుటుంబాల కోసమని దశాబ్దాలుగా చేస్తున్న భూ పంపిణీ కార్యక్రమం వట్టి ప్రహసనంగా మారింది. ఇప్పటిదాకా 25 లక్షల ఎకరాలు పంచినట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఆ భూముల వల్ల నిరుపేద రైతుల జీవితాల్లో వెలుగు వచ్చిన దాఖలాలు లేవు. అసైన్డ్ భూములు అవి అసైన్డ్ దారుల దగ్గర లేవు. చాలా భూములు ఉపయోగంలో లేవు. భూ పంపిణీ శాస్త్రీయంగా జరగలేదు. అసలు అసైన్డ్ భూములు ఏమయ్యాయో కూడా ఇప్పుడు తెలియడం లేదు. అసైన్డ్ భూముల లెక్కలు నిగ్గు తేల్చడం కోసం సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు తిరిగి పంచి పెట్టేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అలాంటి అసైన్డ్ భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు అసైన్డ్ లాండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాం.

కొత్త జిల్లాలు
---------------
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సంకల్పించి కసరత్తు ప్రారంభించాం. ఈ విషయంలో కూలంకషంగా, శాస్త్రీయంగా అధ్యయనం సాగుతున్నది. భౌగోళిక సామీప్యం, ప్రజలకు సౌకర్యం, పరిపాలనలో సౌలభ్యం అనే మూడు అంశాలు గీటురాయిగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జరగాలని నిర్ణయించాం. తెలంగాణలో కొత్తగా 14-15 జిల్లాల ఏర్పాటు అవసరం అవుతుందని భావిస్తున్నాం. ఈ దసరా పండుగ నుండే కొత్త జిల్లాలు కొలువు తీరుతాయి. జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా ఏర్పాటు కానున్నాయి.
అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిస్తూ తెలంగాణ తనను తాను నిర్మించుకుంటూ భారత జాతి నిర్మాణంలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్నది.

పేదరికంపై యుద్ధం
-------------------------
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి అవసరమయ్యే పనులు చేస్తున్నాము. సాగునీరు,తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, వైద్యం లాంటి రంగాలలో అధికంగా నిధులు వెచ్చిస్తున్నాం. రాబోయే నాలుగైదేళ్లలో ఈ రంగాల్లో నిర్వహణ వ్యయమే తప్ప నిర్మాణ వ్యయం ఉండదు. ప్రాజెక్టులతో పాటు మేజర్ పనులు పూర్తవుతాయి. అదే సమయంలో రాష్ట్ర ఆదాయం పెద్దఎత్తున పెరుగుతుంది. అప్పుడు పూర్తిస్థాయిలో మనం పేదరికంపై యుద్ధం ప్రకటిస్తాం. ప్రతీ పేద కుటుంబాన్ని తట్టి లేపుతాం. పేదరికాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొడతాం.

మానవాభివృద్ధి లక్ష్యం
----------------------------
అభివృద్ధి అంటే కేవలం మౌలిక సదుపాయాల కల్పన కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి. మనిషి జీవితకాలం పెరగాలి. కడుపునిండా తిండి, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, యోగ్యమైన నివాసం, పరిశుభ్రమైన పరిసరాలు, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవంతో కూడిన జీవితం.. ఇవే నిజమైన మానవాభివృద్ధి సూచికలు. ప్రముఖ భారతీయ ఆర్థిక వేత్త, నోబుల్ బహుమతి గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్ పేర్కొన్నట్లు... మానవాభివృద్ధి కోసం నిధులు వెచ్చించకుండా సాధించే ఆర్థిక వృద్ధి అస్థిరమైనది, అనైతికమైనది.

బంగారు తెలంగాణకు పునరంకితం
-------------------------------------------
అయితే మానవాభివృద్ధి సూచికలకు అనుగుణంగా అభివృద్ధి సాధించడం అంత సులభం కాదు. కానీ.. సంకల్పబలంతో నిరంతర ప్రయత్నం చేసే వారికి ఏదీ అసాధ్యం కాదు. విజయ సాధనకు ఏకైక సూత్రం అదే అన్నారు మహాత్మాగాంధి. ప్రజలు ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తిస్తున్నారు. అభివృద్ధి చర్యలను హర్షిస్తున్నారు. ఫలితాలు వచ్చి తీరుతాయని విశ్వసిస్తున్నారు. నిరాఘాటంగా పరిపాలన కొనసాగడానికి అవసరమైన మనోబలాన్ని మాకు నిరంతరం అందిస్తున్నారు. ప్రతీ ఎన్నికల్లో ఘన విజయాలు అందించి దీవిస్తున్నారు. ప్రజాబలంతో అజేయంగా పురోగమిస్తాం. అన్ని వర్గాల ప్రజలను వికాసపు దారుల వైపు నడిపించి తీరుతాం. ప్రజల జీవన ప్రమాణాలు ఖచ్చితంగా ఉన్నతస్థాయికి చేర్చుతాం. బంగారు తెలంగాణ అర్థం,పరమార్థం అదే. ప్రజల బతుకులను పండించేదే బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ నిర్మాణానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పునరంకితమవుతున్నామని మరో సారి మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.

జై తెలంగాణ!
జై హింద్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి