ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బ్రిగ్జిట్

ఈయూలోని ఇతర దేశాల నుంచి వలసలు పెరిగి తమ ఉపాధికి ఎసరు పెడుతున్నారని బ్రిటన్‌-లోని అత్యధిక ప్రజలు అసంతృప్తిని వెల్లడించారు. 51.9 శాతం మంది ప్రజలు ఈయూ నుంచి వైదొలగాలని కోరుకుంటే 48.1 శాతం మంది ప్రజలు ఈయూలోనే కొనసాగాలని కోరుకున్నారు. బ్రిటన్‌ ప్రస్తుత జనాభాలో 21.5 లక్షల మంది ప్రజలు వలసల వచ్చిన వారే ఉన్నారు. దీంతో బ్రిటన్‌-లో జీతాల పెరుగుదల వృద్ధి రేటు పడిపోయింది. యూరోపియన్ యూనియన్ నుంచి ఎవరైనా బ్రిటన్ చేరుకుని ఇక్కడ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ఈ వెసులుబాటులు కారణంగా ఎక్కువ నిధులు వీరి ఆరోగ్య సంరక్షణకు ఖర్చు అవుతున్నాయనేది బ్రిటన్ వాసుల ప్రధాన ఆరోపన. వలస వచ్చిన వారి ప్రయోజనాలను పరిరక్షించడం కోసం బ్రిటన్ అనవసర ఖర్చులు చేస్తుందని.. అక్కడ అధికార పార్టీలోని పలువురు ప్రముఖులు కూడా ఆరోపించడమే బ్రిగ్జిట్-కు కారణమయ్యింది.డేవిడ్ కామెరాన్ యూనియన్ లో కొనసాగాలని ప్రయతించాడు అందుకు విరుద్దంగా రెఫరెండం రావడం తో కామెరాన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు