పోలవరం ప్రాజెక్టులో అన్నింటికన్నా ముఖ్యమైనది డయాఫ్రం వాల్ నిర్మాణమే. గోదావరిలో 40 నుంచి 100
మీటర్ల లోతు వరకు వెళ్లి డయాఫ్రం వాల్ నిర్మించుకుంటూ రావాల్సి వస్తుంది. ప్రాజెక్టు స్పిల్ వే నిర్మాణం పూర్తయ్యే సమయానికి ఇందులో అవసరమైన 48 గేట్లు సిద్ధంగా ఉండాలని ప్రణాళిక రూపొందించారు.
2017 చివరినాటికి ఈ 48 గేట్ల నిర్మాణాన్ని పూర్తిచేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రంవాల్ నిర్మాణ పనులు, ప్రాజెక్టులో 48 గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.
2018 నాటికి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తామని చంద్రబాబు తెలిపారు. 2019 నాటికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే 52 శాతం మట్టి తవ్వకాలు పూర్తయ్యాయని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు మిగతా పనులు జరుగుతున్న ప్రదేశాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించి పనులను పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి