అగ్గిరాముడు (1954) మొదలుకుని ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలకు రాముడు అన్న పేరు తగిలించడం, ఆ సినిమా విజయవంతం కావడం ఒక సెంటిమెంటుగా ఉండేది. అడవిరాముడు సినిమాతో ఆ సెంటిమెంటు మరింత గాఢంగా పరిశ్రమను ఏలింది. దాంతో ఎన్టీఆర్ సినిమా రాముడయి పోయారు. అలాంటి చిత్రాలలో ఒకటి డ్రైవర్ రాముడు చిత్రం. నందమూరి హరికృష్ణ, తారకరామా ఫిలిం యూనిట్ పతాకంపై
1979లో నిర్మించిన ఈ సినిమాను, ఆనాడు 35 కేంద్రాలలో విడుదల చేయగా 14 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని, రెండు కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ చేసుకుంది.
ప్రతి సినిమాను వ్యాపారపరంగానే నిర్మించినా అందులో ఎంతో కొంత సామాజిక సందేశాన్ని ఇవ్వందే ఊరుకోరు ఎన్టీఆర్. లారీ యజమానుల అవినీతి వ్యాపారాలకు డ్రైవర్ లు ఎలా బలవుతుంటారు, మద్యపాన వ్యసనం, ఇతరులను మోసగించి బతకడం వంటివి ఎలాంటి అనర్థాలను కొనితెస్తాయో ఈ చిత్రంలోని రాము పాత్ర ద్వారా చెప్పిస్తారు ఎన్టీఆర్. అలాగే అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి అద్దంపడుతూ ఎన్టీఆర్, రోజారమణిలపై చిత్రీకరించిన ''ఏమని వర్ణించనూ...'' అంటూ సాగే ఒక పాట అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ రక్తసంబంధానికి ప్రతీకగా నిలిచిపోతుంది.
చిత్రంలో తాను పోషించింది లారీ డ్రైవర్ పాత్రనే అయినా కోటు ధరించి, బెల్ బాటం ఫ్యాంట్ కు లావాటి బెల్టు పెట్టి, రెండు కాలర్ లు పైకి కనిపించేలా అప్పటి ఫ్యాషన్ కు తగ్గట్టుగా ఆధునికంగా కనిపిస్తారు ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ పాత్రకు 1975లో విడుదలైన 'వైట్ లైన్ ఫీవర్' అనే ఆంగ్ల చిత్రం స్ఫూర్తి అంటారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి