స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు తో రానున్న కాలంలో వినోద కేంద్రాలుగా మారనున్నాయి. ప్రయాణికులకు వాణిజ్య సౌకార్యాలతో పాటు వినోద అందించే మల్టీప్లెక్స్లు ఏర్పడనున్నాయి. రైల్వే స్టేషన్లను వినోద, వాణిజ్య కేంద్రాలుగా విస్తరించేందుకు కేంద్రం రూపొందించిన ‘స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు' తొలి దశను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బుధవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు మల్టీప్లెక్స్లు, దుకాణసముదాయాలు, స్టార్ హోటళ్లను ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమానికి మొత్తం 400 స్టేషన్లను ఎంపిక చేయగా, మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం సహా 23 స్టేషన్లు ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ కూడా ఉంది.
విజయవాడ స్టేషన్లో మల్టీఫంక్షనల్ కాంప్లెక్స్ ఏర్పాటు నిమిత్తం ఇప్పటికే రైల్వేస్టేషన్ ముఖద్వారం ఆవరణలోని స్థలాన్ని రైల్వే శాఖ ఎంపిక చేసింది. తారాపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పుడున్న హోటళ్లతో పాటు రైల్వేస్టేషన్ ఒకటో నెంబరు, 6,7, 9,10 స్టేషన్లలో ఆదనంగా ఏసీ డార్మెటరీలు, సినిమాలు వీక్షించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి