ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అరున్‌ జెట్లీ బడ్జేట్ వివరాలు


  1.  పస్తుతమున్న వ్యక్తిగత ఆదాయం 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు ఉన్న వారికి 10 శాతం పన్ను ను ఐదు శాతానికి తగ్గించారు.
  2. 50 లక్షల పైబడి ఆదాయం ఉన్న వారికి 10 శాతం సర్ ఛార్జీ.
  3. 5 లక్షల నుండి 10 లక్షల ఆదాయం ఉన్న వారిపై  20శాతం పన్ను
  4. ఐఆర్ సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టెకెట్లపై సర్ ఛార్జీ ఎత్తివేత
  5. 50లక్షల టర్నోవర్‌ ఉన్న కంపేనీలకు టాక్స్ రెబేట్‌ 30 శాతం నుంచి 25 శాతం 
  6. వికలాంగులకు అనుకూలంగా ఉండేలా 500 రైల్వే స్టేషన్లలో సదుపాయాలు
  7. రైల్వేకు ప్రభుత్వం  సహాయం 55 వేల కోట్ల 
  8. పార్టీలు పన్ను రిటర్నులు సమర్పించాలి 
  9. * 2017-18 సంవత్సరానికి రెవెన్యూ లోటు 1.9 శాతం 
  10. * పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలోని ప్రజల వాస్తవ ఆర్థిక స్థితిగతులు తెలిశాయి. 
  11. * నగదు లావాదేవీల ద్వారా పన్ను ఎగవేతకు ఆస్కారం ఉంటోంది. అందుకే నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాం.

  12. రూ.5కోట్ల టర్నోవర్‌ లోపు ఉన్న కంపెనీలకు ఒక శాతం కార్పొరేట్‌ పన్ను మినహాయింపు 
  13.  నోట్ల రద్దుతో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపులో 35శాతం వృద్ధి 
  14.  నల్లధనం నిరోధంలో భాగంగా రూ.3లక్షలకు మించి నగదు లావాదేవీలకు అనుమతి లేదు.

  15.  రాజకీయ పార్టీల విరాళాలు రూ.20వేలకు మించితే లెక్క చూపాలి. విరాళాలు చెక్కు లేదా డిజిటల్‌ రూపంలోనే చెల్లించాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. 
  16.  చారిటబుల్‌ ట్రస్టులకు ధన రూపేణా విరాళాలు రూ.2వేలకు మించరాదు. 
  17. * డిజిటలైజేషన్‌ ప్రోత్సహించే పరికరాలకు పన్ను మినహాయింపు

  18. బడ్జెట్‌ 2017-18 @ 21.47లక్షల కోట్లు 
  19.  రక్షణ రంగానికి రూ.2.74లక్షల కోట్లు 
  20. బీమ్‌ యాప్‌ ప్రోత్సాహం కోసం రెండు కొత్త పథకాలు
  21.  సామాన్యుడికి ప్రయోజనం కలిగేలా నగదు రహిత చెల్లింపు వ్యవస్థ 
  22. పెట్రోల్‌ బంకులు, ఆస్పత్రుల్లో నగదు రహిత చెల్లింపులకు ప్రోత్సాహం

  23.  రూ.2500 కోట్ల నగదు రహిత లావాదేవీలు జరపాలన్నది లక్ష్యం. 
  24.  త్వరలో ఆధార్‌ అనుసంధానిత వ్యవస్థ 
  25.  ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళ్లే నేరగాళ్ల ఆస్తుల జప్తు కోసం ప్రత్యేక చట్టం 
  26.  2020లోగా 20లక్షల ఆధార్‌ ఆధారిత పీవోఎస్‌ యంత్రాలు

  27. గ్రామాలకు ఇంటర్నెట్‌ 
  28.  భారత్‌ నెట్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కోసం రూ.10వేల కోట్లు 
  29.  మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,96,135 కోట్లు
  30.  దేశవ్యాప్తంగా 250 ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పాదక కేంద్రాలు. వీటి కోసం రూ.1.26లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 
  31.  20వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు

  32.  ప్రభుత్వ రంగ సంస్థలను స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ చేసేందుకు విలువ నిర్థరణ కమిటీ ఏర్పాటు 
  33.  ముద్రా రుణాల కోసం రూ.2.44లక్షల కోట్లు 
  34.  వృద్ధులకు ఆధార్‌ ఆధారిత ఆరోగ్య కార్డులు 
  35.  విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు రద్దు 
  36. ఒడిశా, రాజస్థాన్‌లో ముడి చమురు నిల్వ కేంద్రాల ఏర్పాటు

  37. రైల్వే బడ్జెట్‌ రూ.1.31లక్షల కోట్లు 
  38.  రైల్వేకు రూ.55వేల కోట్ల ప్రభుత్వ సాయం 
  39.  2020 నాటికి బ్రాడ్‌గేజ్‌ మార్గాల్లో గేట్లు ఏర్పాటు 
  40.  ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసుకునే రైలు టికెట్లపై సేవాపన్ను రద్దు 
  41.  2017-18లో 25 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ

  42.  దేశీయ అవసరాలకు అనుగుణంగా కొత్త మెట్రో రైలు విధానం 
  43. జనరిక్‌ ఔషధాల వినియోగానికి ప్రత్యేక విధానం 
  44. వైద్య పరికరాలు, ఉత్పత్తికి ప్రత్యేక విధానం 
  45.  2025లోగా క్షయ వ్యాధి నిర్మూలనకు చర్యలు

  46.  వెనుకబడిన కులాలకు రూ.52,393 కోట్లు కేటాయింపు 
  47.  గిరిజనులకు రూ.31,920 
  48.  మైనారిటీలకు రూ.4,195 కోట్లు 
  49.  వృద్ధులకు 8శాతం వడ్డీతో ఎల్‌ఐసీ ద్వారా ప్రత్యేక బాండ్లు

  50.  మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కానికి రూ.48వేల కోట్ల కేటాయింపు. 
  51.  2018క‌ల్లా గ్రామీణ విద్యుద్దీక‌ర‌ణ పూర్తి. దీంతో అన్ని గ్రామాల్లో విద్యుత్ సౌక‌ర్యం. 
  52.  ఫ్లొరైడ్ బాధిత గ్రామాల్లో ర‌క్షిత మంచినీటి స‌ర‌ఫ‌రా. 
  53.  గ్రామాల్లో అభివృద్ధి 42 నుంచి 60శాతానికి పెరిగింది.

  54.  2018క‌ల్లా గ్రామీణ విద్యుద్దీక‌ర‌ణ పూర్తి. దీంతో అన్ని గ్రామాల్లో విద్యుత్ సౌక‌ర్యం. 
  55.  ప్ర‌ధాన మంత్రి ప‌జ‌ల్ యోజ‌న కింద రోడ్లు, 133 కి.మీ. ప్ర‌తి రోజూ నిర్మించ‌నున్నాం. 
  56.  ఉపాధిహామీ ప‌థ‌కంలో మ‌హిళ‌ల‌కు ప్రాతినిథ్యం పెంపు 
  57.  కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార కేంద్రాలు

  58.  100 రోజుల క‌నీస ఉపాధిహామీ. 
  59. స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భించింది. 
  60.  సంక‌ల్ప్ ప‌థ‌కం ద్వారా యువ‌త‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌. 
  61.  ఐసీటీ ద్వారా విద్యాబోధ‌న‌. అన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు ఒకే సంస్థ‌

  62.  ప్ర‌తిభ క‌లిగిన క‌ళాశాల‌ల్లో ప్ర‌త్యేక ప్రోత్సాహకాలు. 
  63.  సెకండ‌రీ విద్య‌లో ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్ర‌త్యేక‌నిధి. 
  64.  ఉపాధి అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న కోర్సుల ఏర్పాటు.
  65.  దేశం వెలుప‌ల కూడా ఉపాధి పొందేందుకు వీలుగా శిక్ష‌ణ‌. 
  66.  దేశ‌వ్యాప్తంగా 100 నైపుణ్య కేంద్రాలు.
  67. నైపుణ్యాభివృద్ధికి సంకల్పనిధి 
  68.  విద్యారంగం కోసం ప్రత్యేక డీటీహెచ్‌ ఛానల్‌ ఏర్పాటు
  69.  600 జిల్లాల్లో ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు 
  70.  రూ.4వేల కోట్లతో నైపుణ్యాభివృద్ధికి సంకల్ప నిధి 
  71.  నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఐటీఐల అనుసంధానం
  72.  ఐదు ప్రత్యేక పర్యాటక జోన్ల అభివృద్ధి 
  73.  మహిళా సాధికారత కోసం రూ.500కోట్ల మహిళా శక్తి కేంద్రాలు 
  74.  గర్భిణుల ఆస్పత్రి ఖర్చులకు రూ.వేల నగదు బదిలీ 
  75.  గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా
  76.  గృహ రుణాలిచ్చే బ్యాంకులకు జాతీయ హౌసింగ్‌ బ్యాంక్‌ ద్వారా రూ.20వేల కోట్ల రుణం 
  77.  నోట్ల రద్దు ద్వారా వచ్చిన నగదు నిల్వలతో ఇప్పటికే బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. పరిమిత స్థాయిలో గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు ప్రధాని ఇప్పటికే ప్రకటించారు.
  78.  2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని అరికడతాం. 
  79.  ఉపాధి హామీ పథకానికి రూ. 48 వేల కోట్లు కేటాయింపు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర ఉపాధి హామీ కోసం చర్యలు తీసుకుంటాం. వ్యవసాయం కోసం ఉపాధి హామీ పథకం నిధులు వినియోగిస్తాం. 
  80. * వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1,87,23 కోట్లు ఖర్చుచేస్తాం. 
  81.  ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజనకు రూ.19,100కోట్లు
  82.  ప్రధాని ఆవాస్‌ యోజనకు రూ.23వేల కోట్లు 
  83.  గ్రామజ్యోతి యోజనకు రూ.4,300కోట్లు 
  84.  అంత్యోదయ యోజనకు రూ.2,500కోట్లు 
  85.  నిరుపేదలకు కోటి ఇళ్ల నిర్మాణం 
  86.  ఫ్లోరైడ్‌ పీడిత 28వేల గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పథకాలు
  87.  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ ఒక‌టిగా ఐఎంఎఫ్ పేర్కొంది. 
  88.  విదేశీ పెట్టుబ‌డులు భారీగా త‌ర‌లివ‌స్తున్నాయి. 361 బిలియ‌న్ డాల‌ర్లు విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు చేరాయి.
  89.  రైతులకు అండ‌గా ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌ను 30శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నాం.
  90. పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధికి చ‌ర్య‌లు. పాల కేంద్రాల‌ను పాల‌వెల్లువ ప‌థ‌కం కింద రూ.8వేల కోట్ల‌తో పాల‌సేక‌ర‌ణ కేంద్రాల స్థాప‌న‌. 
  91.  గ్రామీణ ప్రాంతాల‌పై దృష్టి పెట్ట‌డంతో పాటు మౌలిక సౌక‌ర్యాలకు ప్రాధాన్య‌త ఇస్తున్నాం. 
  92.  గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు వేగ‌వంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్‌టీ ఒక‌టి. 
  93.  ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అనిశ్చితిలో ఉంది. అయినా భార‌త్ అన్నిరంగాల్లో ప్ర‌గ‌తి సాధించింది.
  94. వ్యవసాయ రుణాలకు రూ. 10లక్షల కోట్లు కేటాయింపు 
  95.  ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లో వ్యవసాయ రంగానికి 60 రోజుల వడ్డీ మినహాయింపు 
  96.  నాబార్డుతో సహకార బ్యాంకులు, వ్యవసాయ సంఘాలను అనుసంధానిస్తాం
  97.  ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలోనూ భూసార పరీక్ష కేంద్రాల ఏర్పాటు 
  98.  సాగునీటి సౌకర్యం కోసం రూ.40వేల కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు 
  99.  ఈనామ్‌లు రూ.240 నుంచి రూ.500 పెంపు
  100.  రైతులు, గ్రామీణ ఉపాధి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి 
  101.  నోట్ల రద్దు, జీఎస్‌టీ ద్వారా ఆర్థిక వ్యవస్థలో అతి గొప్ప మార్పునకు పునాది పడింది. 
  102.  ముడి చమురు ధరల్లో ఒడిదొడుకులు ఇబ్బంది పెట్టాయి.
  103.  దేశ జీడీపీ 2017-18లో 7.6 శాతం, 2018-19లో 7.8 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. 
  104.  మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన దిశగా బడ్జెట్‌ రూపొందించాం. 
  105.  ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విదేశీ పెట్టుబడుల విధానాలు సరళీకరిస్తున్నాం.
  106.  ఈ బడ్జెట్‌ ద్వారా మూడు సంస్కరణలు తీసుకొచ్చాం. బడ్జెట్‌ను ఫిబ్రవరికి మార్చాం. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపాం. 
  107.  ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంలా కాకుండా రంగాల వారీగా బడ్జెట్‌ రూపొందించాం. 
  108.  రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు చేస్తాం.
  109.  2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. 
  110.  ఈ ప్రభుత్వం సంపూర్ణ పారదర్శక విధానాలను అమలు చేస్తోంది. 
  111.  విదేశీ మారక ద్రవ్యనిల్వలు 361 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.
  112. భారత్‌ ఉత్పాదక రంగంలో ప్రపంచంలో 9వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకింది. 
  113.  ద్రవ్యోల్బణాన్ని రెండంకెల నుంచి కనిష్ఠస్థాయికి తగ్గించాం. 
  114.  నల్లధనం అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేశాం. నల్లధనంపై యుద్ధం ప్రకటించాం. అవినీతిని నిర్మూలిస్తాం.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

తెలంగాణకు హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ జిల్లాల్లో, తమ శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దుల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అందమైన రకరకాల పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కా ర్యక్రమాన్ని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 165 కిలోమీటర్ల రోడ్డుపై ఒకేసారి 85 వేల మంది మొక్కలు నాటుతారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటుతారు. ఈ మొత్తం రహదారిని 14 సెంగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెంగ్మెంటుకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షిస్తున్నారు. స్వయం సహాయక బృందాల సభ...

సీఎంపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల పాలనంతా అస్తవ్యస్తమేనని... వేసీపీ నేత రోజా విమర్శించారు. ఆయనకు మూడేళ్లూ కుర్చీ కాపాడుకోవటానికి సరిపోయిందన్న రోజా... వైఎస్ పథకాలను పేర్లు మార్చి మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆరోపించింది. కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసుంటే... 2009లోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది