తమిళనాడు అసెంబ్లీ లో పళనిస్వామి బల నిరూపణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు
నెలకొన్నాయి. తమిళనాడు శాసన సభ రెండుసార్లు వాయిదా తో తిరిగి ప్రారంభమైన వెంటనే డివిజన్
వారిగా ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు.ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు
వెళ్లి ప్రజాభిప్రాయం తెలసుకొన్న పిమ్మటే ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షం పట్టుబట్టింది.తీవ్ర
గందరగోళం నెలకొనడంతో డిఎపకే ఎమ్మెల్యేలనుసభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ధనపాల్
ప్రకటించారు.మళ్ళీ సమావేశమైన శాసన సభ ఉత్కంఠ నడుమ పళని స్వామికి మెజారిటీ దక్కింది.అమ్మ గెలిచిందంటు పళనిస్వామి వర్గం నినాదాలు చేశారు. అనంతరం మెరీనా బీచ్ గాంధీ విగ్రహం వద్ద స్టాలిన్ నిరాహర దీక్ష చేపట్టడానికి ప్రయత్నించటంతో పొలీసు అరెస్టు చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి