తమిళనాడులో రాజకీయ
అనిశ్చితికి తెరపడే ఆవకాశం కనిపిస్తుంది. అన్నాడీఎంకే సీనియర్ నేతల్లో ఒకరైన పళనిస్వామి
కి తమిళనాడు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. శాసనసభ అధ్యక్షునిగా
ఎన్నికైన పళనిస్వామికి గవర్నర్ నుంచి ఆహ్వానం వచ్చింది. 15 రోజులలో తమిళనాడు అసెంబ్లీలో
బలనిరూపణ చేయ వలసిందిగా గవర్నర్ కోరడం జరిగింది.
పళనిస్వామి
1989 లో జయలలిత వర్గం నుంచి కోడిపుంజు గుర్తుపై ఎడప్పాడి నియోజకవర్గంనుంచి గెలుపొందారు.
మూడుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2011 లో జయలలిత మంత్రి వర్గం లో రహదారుల
శాఖమంత్రిగా, 2016లో ప్రజాపనులు శాఖ మంత్రిగా పని చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి