ఆంద్రప్రదేశ్ లో మూడు విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం గ్రీన్
సిగ్నల్ ఇచ్చింది. విజయ నగరం జిల్లా భోగాపురం,నెల్లూరు జిల్లా దగదర్తి, కర్నూలు
జిల్లా ఓర్వకల్లు లో విమానాశ్రయాల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణహించానలని ,భోగాపురం
విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని
భావిస్తుంది. భోగపురం విమానాశ్రయంలో భారీ విమానాల రాక పోకలు,సంబంధిత పరిశ్రమల
స్థాపన, ఎయిర్ క్రాప్ట్ల మెయింటెనెన్స్, రిపేర్,ఓవర్‌హాల్ సౌకర్యాలు,ల్యాబొరేటరీలు,
రీసెర్చసెంటర్లు,లీజర్,ఎంటర్టైన్మోంట్ సెంటర్లు,విమానయాన విద్య,శిక్షన వసతులను
5311 ఎకరాల విస్తర్ణంలో ఏర్పాచలని
తలుస్తుంది. తొలి విడతగా రెండువేల నాలుగు ఎకరాల్లో ఎయిర్ పొర్టు పనులు చేపట్టలని
నిర్ణయించారు. విమానశ్రయం కోసం సేకరించనున్న భూమిలో ల57 శాతం ప్రైవెటు స్థలాలు
కాగా, 43 శాతం ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే 800 ఎకరాల భూమిని ప్రైవెట్ వ్యక్తులు
ఇపవ్వటానికి ముందుకొచ్చారని ,మిగిలిన 800 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిచంచాల్సిన
ఉందని,ఎయిర్ పోర్టు నిర్మాణానికి హడ్కో రూ.1500 కోట్లు ఇవ్వటానికి అంగీకిరంచిందని
ప్రభుత్వం చేబుతుంది.
దగదర్తి
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా నెల్లూరుకు 30 కిలోమీటర్ల దూరంలో
రాష్ట్రప్రభుత్వం నిర్మించాలని నిర్ణయించింది. గుంటూరు చెన్నై నేషనల్ హైవేకు ఈ విమానాశ్రయం
అతి సమీపంలో ఉంటుంది. విశాఖ-చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు ఈ ఎయిర్
పోర్ట్ నోడల్ పాయింట్ కాబోతుంది.కృష్ణపట్నం
పోర్టుకు సమీపంలో, శ్రీ సిటి కి కూడా
దగ్గరగా ఉండటంతో పారశ్రామిక వేత్తలకు ఈ ఎయిర్ పోర్ట్ చాలా ఉపయోగంగా ఉంటుంది.ఈ
ఎయిర్ పోర్టును పబ్లక్ ప్రైవెట్ పార్టనర్ షిప్ పద్దతిలో నిర్మిస్తారు. 1390
ఎకరాల భూమి అవసరముండగా ఇందులో 840 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా,290 ఎకరాలు ప్రైవెటు
భూములను సేకరించవల్సి ఉంది.70కోట్ల రుణం హడ్కో సంస్థ మంజూరు చేసింది.
ఓర్వకల్లు
కర్నూలుకు 26 కిలోమీటర్ల దూరంలో గ్రీన్‌పీల్డ్ విమానాశ్రయంగా
,మైనింగ్.పుడ్ ప్రోసెసింగ్ రంగాలకు ఉపయోగకరంగా ఈ ఎయిర్ పోర్ట్ తీర్చదిద్దాలని
ప్రభుత్వం భావిస్తుంది. ఈ చుట్టూప్రక్కల ప్రాంతాలలో సిమెంట్,స్టీల్,టెక్స్ టైల్
పరిశ్రమలు, సోలార్, పవన్ విద్యుత్ రంగాలకు ఈ ప్రాంతం అనుకులంగా,దీనికి తోడు
అద్యాత్మిక కేంద్రాలకు కర్నూలు కేరాఫ్ అడ్రెస్ కావడంతో ఎక్కువ మంది టూరిస్టుల సంఖ్యభవిషత్తులో పెరిగే ఆవకాశం దృష్ట్య ఈ
విమానాశ్రం ఈ ప్రదేశంలో నిర్మించతలపెట్టింది రాష్ట్రప్రభుత్వం. 1010 ఎకరాల భూమి అవసరం
కాగా,అందులో 240 ఎకరాల ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమిని ప్రభుత్వం
సేకరించింది.తొలి దశలో ఎర్త్వర్క్,రన్ వే,ట్యాక్సీ వే,ఆప్రాన్,టెర్మినల్
బిల్డింగులు, ఇతర భవనాలను ఇంటర్నల్‌రోడ్, కార్ పార్కింగ్ ప్రహరీ గోడ నిర్మాణం, డ్రైనేజీ
వ్యవస్థ, ఎలక్ట్రికల్ వర్క్స వంటి పులు
88 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్నమని .. 112 కోట్ల రూపాయలతో మిగిలిన పనులు పూర్తి
చేస్తునున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి