హరితహారం కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఈ ఏడాది 40 కోట్ల మొక్కల లక్ష్యానికి గాను ఇప్పటికే రాష్ట్రంలో 30 కోట్ల మొక్కలు నాటినట్లు సిఎంఒ స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, ఓఎస్డి ప్రియాంక వర్గీస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే నాటిన మొక్కలను భవిష్యత్తులోనూ రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని, మంత్రులు, కలెక్టర్లు, ఎస్.పి, ఫారెస్ట్ అధికారులు హరితహారం నిరంతర కార్యక్రమంగా పరిగణించి ప్రణాళిక రూపొందించుకోవాలని సిఎం సూచించారు. మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో ఇద్దరు మంత్రులు ఉంటే 90 కిలోమీటర్ల చొప్పున ప్లాంటేషన్, సంరక్షణను పర్యవేక్షించాలని పేర్కోన్నారు.
మొక్కలకు నీళ్లు పోసే ప్రక్రియ కోసం ఫైర్ ఇంజన్లు, ట్యాంకర్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్వాహకులు మొక్కల పెంపకం విషయంలో నిర్లక్ష్యం చేస్తే వారి మీద చర్య తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫారెస్ట్ రిజ్వోనేషన్ ను పూర్తి స్థాయిలో చేపట్టాలని సూచించారు. జిల్లాల పర్యటనలో తాను హరితహారం ప్రగతిని ఖచ్చితంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి పేర్కోన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. నర్సింగ్ రావు, సిఎం అదనపు ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి