హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో వర్షాలు, దాని వల్ల సంభవించిన పరిణామాలపై సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం, అధికారులతో మాట్లాడారు. హుస్సేన్‌సాగర్ తో పాటు అన్ని చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రమాదాలను నివారించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలని, ప్రజలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు సూచనులు చేయాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే డిజాస్టర్ మేనేజ్ మెంట్, పోలీస్, ఆర్మీ సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. నగరంలో కంట్రోల్ రూమ్ కు వచ్చిన సమాచారం ప్రకారం వెంటనే స్పందించాలని కోరారు. రాబోయే రెండు మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అంటూ రోగాలు ప్రబల కుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి