అప్పర్ మానేరు నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం రావడం వల్ల ఎంఎండికి ఇబ్బంది కలిగిందన్నారు. దశాబ్ధ కాలంగా ఎంఎండి పనులు జాప్యం కావడం వల్లే అనర్థం జరిగిందని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు. పనుల్లో జాప్యం చేసిన వర్కింగ్ ఏజెన్సీల కాంట్రాక్టు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించారు. మిడ్ మానేరు ఆనకట్ట 130 మీటర్ల దెబ్బతిన్నదని, ఇకపై వరదలు వచ్చినా పెద్దగా నష్టం లేదని అధికారులు చెప్పారు. ఇకపై ప్రమాదం వుండదు కాబట్టీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారిని తిరిగి తమ గ్రామాలకు తరలించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
వర్కింగ్ ఏజెన్సీలు తమకు అప్పగించిన పనులు సకాలంలో జరిగేటట్లు అవసరమైన నిబంధనలు రూపొందించాలన్నారు. 5% మించిన లెస్ కు పోకుండా చూడాలని, లెస్ టెండర్లు వేసినప్పుడు అంతమొత్తం బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నీటి పారుదల శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులు చేస్తున్నందున పనుల్లో వేగం అవసరం అన్నారు. 123 జీవో కింద మంచి పరిహారం ఇస్తున్నందున భూసేకరణ/ కొనుగోలు త్వరితగతిన కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్ మానేరు చాలా కీలకమైంది కాబట్టి, దాని పనులు నాణ్యతతో వేగంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చెప్పారు.
గోదావరి వరదల నేపథ్యంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు అప్రమత్తంగా వుండాలన్నారు. వరంగల్ జిల్లా రామన్నగూడెం, ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద మరింత అప్రమత్తంగా వుండాలన్నారు. ప్రాజెక్టుల వద్ద పెరుగుతున్న ఇన్ ఫ్లోలకు అనుగుణంగా ఔట్ ఫ్లో పెంచాలన్నారు. ఎల్ఎండి నుంచి విడుదలయ్యే నీరు ఖమ్మం, నల్లగొండ జిల్లాల దాకా చేర్చాలని సిఎం ఆదేశించారు. మహారాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వరద పరిస్థితిని అంచనా వేసి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
కర్ణాటక నుంచి వచ్చే వరదను బట్టి సింగూరు ప్రాజెక్టు ఔట్ ఫ్లోను ఎప్పటికప్పుడు నిర్ణయించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు.
భారీ వర్షాలు కురవడం వల్ల రాష్ట్రంలోని చెరువులన్నీ నిండాయిని, అలుగు పోస్తున్నాయని సిఎం చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా పనులు చేసిన చెరువులలో ఒక్క కట్టకూ ఇబ్బంది కలుగకపోవడం గమనార్హం అన్నారు. మిషన్ కాకతీయ పనుల వల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరింగిందని, కట్టలు బల పడ్డాయనీ సిఎం అన్నారు.
ఈ పరిస్థితిని ప్రజలు గమనించారని సిఎం చెప్పారు. ఇంతకన్నా తక్కువ వర్షం, తక్కువ వరదలు వచ్చిన సందర్భాల్లో కూడా వందలాది చెరువు కట్టలు తెగిపోయిన సందర్భాలున్నాయన్నారు. మిషన్ కాకతీయకు ప్రశంసలు వస్తున్నాయని సిఎం చెప్పారు.
వర్షాలు, వరదల వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవాలని, ముఖ్యంగా మనుషులు, పశువుల ప్రాణాలు కాపాడడానికి అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలని సిఎం సూచించారు. జరిగిన నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు, ఇండ్లు కోల్పోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలని సూచించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి