ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అవలక్షణాలు లేకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వ శాఖల ఏర్పాటు-కేసీఆర్

జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణ కూడా ప్రజలకు ఎక్కువ మేలు చేసే విధంగా ఉండేలా కార్యాచరణ రూపొందిచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. జిల్లాల పునర్విభజనలో ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణపై శనివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
భవిష్యత్తులో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి లభ్ధిదారుడి వివరాలు కలెక్టర్లు కంప్యుటర్ లో అందుబాటులో ఉండే విధంగా డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. డిజిటలైజేషన్ లో అనుభవం, అర్హతలున్న ఇంజనీర్లను కలెక్టర్లకు సహాయపడే విధంగా నియమించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవలక్షణాలేవీ లేకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వ శాఖలను పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో ఉన్న పద్దతులు, సంప్రదాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖలను ఏ విధంగా చేరువ చేయాలనే సంకల్పంతో శాఖల డిజైన్ ను రూపొందించాలని సిఎం ఆదేశించారు. 
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించే క్రమంలో అన్ని శాఖలకు క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకోవడానికి అవసరమైన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విషయంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రజలే నేరుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించే విధంగా ప్రణాళిక రూపొందిచాలని సూచించారు. గతంలో మాదిరిగా ఉద్యోగులంటే వాళ్లను దొంగల్లా భావించే పద్దతి ప్రభుత్వంలో ఉండకూడదని సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో వాళ్లు కూడా భాగాస్వాములేననే విషయాన్ని మరిచి పోకూడదన్నారు. దురదృష్టవశాత్తు గత సమైక్య పాలనలో ఉద్యోగులను చిన్న చూపు చూసే పరిస్థితి ఉండేదన్నారు. పునర్విభజన ప్రక్రీయలో వీలైనంత వరకు అర్హత ఉన్నవారందరికీ ప్రమోషన్లు ఇచ్చి వారు పూర్తి నిబద్దతతో ప్రజలకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్న చిన్న అనుబంధ శాఖలన్నింటిని ఒకే గొడుగు క్రిందకు తీసుకురావాలని సూచించారు. ఇరిగేషన్, వ్యవసాయం వంటి కీలక రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సిఎం వివరించారు.
రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉండాల్సిన ప్రాంతం... గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరువుతో తల్లడిల్లే పరిస్థితి వచ్చిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 58 ఏండ్ల చరిత్రలో ఒకే ఒక్క ఏడాది మాత్రమే ఇరిగేషన్ కు 15,500 కోట్లు బడ్జెట్ లో కేటాయించారని అదే ఎక్కువ కేటాయింపులన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏడాదికి 25 వేల కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని అన్నారు. గతంలో ఏపీకి 13 మంది ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు ఉంటే నేడు ఒక్క తెలంగాణకే 15 మంది సీఈలు ఉన్నారని పేర్కొన్నారు. సమైక్యపాలనలో తెలంగాణలో మొత్తం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న వ్యవసాయ గిడ్డంగులు మాత్రమే ఉంటే... తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే 21 లక్షల టన్నుల గిడ్డంగులు నిర్మించేలా ప్రణాళిక రూపొందించామని, ఇప్పుడు వాటి నిర్మాణం వేగంగా జరుగుతున్నదని సిఎం వివరించారు.
నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించడం సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యమైన విషయమని, జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నేరాలను పూర్తి స్థాయిలో అదుపు చేసే చర్యలను తీసుకోవాలని, దానిలో భాగంగానే కొత్తగా ఏర్పడే మండల కేంద్రాలలో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమైన సిబ్బంది నియామకం జరగాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరూ పూర్తి సంతోషంగా ఉండేలా కొత్త జిల్లాల ప్రక్రీయ ల్యాండ్ కావాలన్నారు. దసరా రోజు తానూ కొత్తగా ఏర్పడే సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవానికి, తనతో పాటు మంత్రులు, చీఫ్ సెక్రెటరీ, డిజీపి వంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇతర జిల్లాల్లో పరిపాలన ప్రక్రియను లాంచనంగా ప్రారంభించేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జిల్లాల పునర్విభజన పురోగతిని చర్చించేందుకు ఈ నెల 6న కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, డీజీపీ అనురాగ్ శర్మ, ఇంటలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, సిఎం అదనపు ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతకుమారి, సిఎంఓ అధికారులు స్మితాసభర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

తెలంగాణకు హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ జిల్లాల్లో, తమ శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దుల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అందమైన రకరకాల పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కా ర్యక్రమాన్ని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 165 కిలోమీటర్ల రోడ్డుపై ఒకేసారి 85 వేల మంది మొక్కలు నాటుతారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటుతారు. ఈ మొత్తం రహదారిని 14 సెంగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెంగ్మెంటుకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షిస్తున్నారు. స్వయం సహాయక బృందాల సభ...

సీఎంపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల పాలనంతా అస్తవ్యస్తమేనని... వేసీపీ నేత రోజా విమర్శించారు. ఆయనకు మూడేళ్లూ కుర్చీ కాపాడుకోవటానికి సరిపోయిందన్న రోజా... వైఎస్ పథకాలను పేర్లు మార్చి మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆరోపించింది. కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసుంటే... 2009లోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది