జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న మోయినాబాద్, శంకరపల్లి, షాబాద్ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాలో కలుపాలని, మోయినాబాద్, శంకరపల్లి, షాబాద్ మండలాలు శంషాబాద్ కు సమీపంలో ఉంటాయని, ఈ మూడు మండలాల ప్రజలు శంషాబాద్ జిల్లాలోనే ఉండాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే యాదయ్య ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు మండలాలను శంషాబాద్ లోనే ఉంచాలని పట్టుపట్టారు. దీంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మూడు మండలాలను శంషాబాద్ లో చేర్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మూడు మండలాలను శంషాబాద్ లో కలపాలని నిర్ణయించిన ముఖ్యమంత్రికి మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి