ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ నియామకం

బలహీనవర్గాల (బీసీ) కులాలకు చెందిన వారి జీవన ప్రమాణాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా వచ్చే బడ్జెట్లో బీసీ సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని సిఎం ప్రకటించారు. బీసీ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి బీసీ కులాల వారి సమగ్ర అభివృద్ధి కోసం తీసుకునే చర్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ను నియమించనున్నట్లు సిఎం ప్రకటించారు. కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అధికార ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీసీల కోసం నియోజకవర్గానికి ఒకటి చోప్పున రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించడంతో పాటు, బీసీ స్టడీ సర్కిళ్లను పకడ్బందీగా నిర్వహించడం అత్యంత ప్రాధాన్యతాంశమని సిఎం చెప్పారు. బీసీల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం సిఎం సమీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, సిఎం ముఖ్య కార్యదర్శి సి. నర్సింగ్ రావు, సిఎం ప్రత్యేక కార్యదర్శులు రాజశేకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీ కులాలకు చెందిన బావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారికి మంచి చదువు అందించి గొప్ప పునాది వేయాలని సిఎం ఆదేశించారు. సమాజంలో సగభాగం ఉన్న బీసీల పురోగతి వారి పిల్లలకు మంచి విద్యను అందించడం ద్వారా సాధ్యమవుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. బీసీ పిల్లల చదువు కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం స్పష్టం చేశారు. మొదటి దశలో రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రారంభించాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలోనే ఈ పాఠశాలలు ప్రారంభం కావాలని, ఇందులో సగం బాలురకు, సగం బాలికలకు కేటాయించాలన్నారు. వచ్చే జూన్ నాటికే రెసిడెన్షియల్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, విద్యార్థుల చేరిక, వారికి వసతి తదితర ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. సిలబస్, ఇతర విద్యా సంబంధ అంశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు నడుస్తున్నట్లే, అవే ప్రమాణాలతో బీసీ గురుకుల పాఠశాలలు నడవాలని, అందుకోసం నిబద్ధత కలిగిన అధికారిని నియమించాలని సిఎం ఆదేశించారు. బీసీ విద్యార్థులకు గురుకులాల్లో మంచి విద్య, వసతి, భోజనం, దుస్తులు, పుస్తకాలు ఉచితంగా అందివ్వాలని ఆదేశించారు. ఆటస్థలంతో పాటు మంచి ప్రాంగణాన్ని బీసీ గురుకులాల కోసం సిద్ధం చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో వివిధ స్టడీ సర్కిళ్లు నడుస్తున్నప్పటికీ అవన్నీ కేవలం నామమాత్రంగానే ఉన్నాయని సిఎం అభిప్రాయపడ్డారు. బీసీ స్టడీ సర్కిళ్లతో పాటు అన్ని స్టడీ సర్కిళ్లలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ అందాలని సిఎం ఆకాక్షించారు. స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన విద్యార్థులు ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదించే విధంగా, అకాడమీల తరహాలో వాటిని నిర్వహించాలని చెప్పారు. ఇందుకు కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సిఎం ఆదేశించారు. బీసీ గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం ఇప్పటి నుంచే స్థలాన్వేషణ జరపాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్ల పరిస్థితి, భవనాలు, స్థలం తదితర అంశాలపై కూడా అధ్యయనం చేయాలని చెప్పారు. వాటిని గురుకులాలుగా తీర్చిదిద్దే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.
నిరుపేద బీసీల సామాజిక, ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీసీల సంక్షేమం పేరిట గతంలో ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు హాస్యాస్పదంగా, నామమాత్రంగా ఉన్నాయని సిఎం అన్నారు. అలా కాకుండా నిజంగా బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడేలా ప్రభుత్వ ఆర్థిక సహాయ కార్యక్రమాలుండాలని చెప్పారు. అందుకు అవసరమైన కార్యక్రమాలను రూపొందించాలని, ఇందుకోసం సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. బీసీలకు సంబంధించిన వ్యవహారాలను పరిశీలించి, ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ వేయాలని సిఎం ఆదేశించారు. బీసీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అధికార ప్రక్రియను ప్రారంభించాలని చెప్పారు. త్వరలోనే కేబినెట్ సమావేశామయి బీసీ కమిషన్ ఎర్పాటుకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర విషయాలను కూడా చర్చిస్తామని సిఎం ప్రకటించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.