ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హైదరాబాద్ మహా గొప్ప నగరం

హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో పాటు రోడ్లు ఇతర మౌళిక సౌకర్యాల కల్పనను సమాంతరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బుధవారం నాడు క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ నగరంలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. నగర అభివృద్ధికి బ్యాంకర్ల నుంచి ఆర్ధిక సహాయం తీసుకుని అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని మున్సిపల్ మంత్రి కె.టి. రామారావును, అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో మిషన్ భగీరథ వంటి పథకాలను చేపడుతుండడంతో బ్యాంకర్లలో విశ్వాసం ఏర్పడి రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చారని సిఎం పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం వ్యాపార రంగంలో ఇంకా అభివృద్ధి దిశగా వేళ్లే అవకాశం ఉన్నందున ప్రభుత్వరంగ బ్యాంకులను రుణాల కోసం సంప్రదించి పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందని సిఎం తెలిపారు. నగరంలో అత్యవసరంగా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
హైదరాబాద్ నగరం ఆదాయం భవిష్యత్ లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మహా గొప్ప నగరంగా రూపొందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పది నుంచి పన్నెండు సంవత్సరాలు నిరంతర కృషి చేస్తేనే హైదరాబాద్ విశ్వనగరంగా తయారవుతుందని ఆ దిశగా పూనాది బలంగా వేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత ప్రాతిపదికన చేపట్టడంతో పాటు నగరం చుట్టూ రైతుల భాగస్వామ్యంతో టౌన్ షిప్స్ నెలకోల్పేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. నగరంలో వరదల కారణంగా రహదారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో ఇదే వేగాన్ని కొనసాగించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వచ్చే రాష్ట్ర బడ్జెట్ నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇటీవలి వరదలవల్ల పాడైన రోడ్లను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కేటాయిస్తామని సిఎం తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు నగరంలో రెండు రోజుల్లో నాలుగు వందల అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు