ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అన్నితెలంగాణ కొత్త జిల్లాలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం, ప్రజలకు పరిపాలన మరింత చేరువకావడం కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి టాస్క్ ఫోర్స్ కు సరైన సూచనలు చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాలు వేరే మండలంలో ఉంటే అక్కడి ప్రజల అభిప్రాయాలు తీసుకుని మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు సౌకర్యంగా ఉండడమే ప్రాతిపదికగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాట్లు జరుగుతున్నవని, ప్రజలకు అసౌకర్యంగా ఉండే ప్రతిపాదనలను మార్చుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి శషబిషలు లేవని సిఎం స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు కూడా రాజకీయ కారణాలతో కాకుండా ప్రజలు కేంద్రంగా ఆలోచించాలని సూచించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాల్లో ఉండాలనే ప్రతిపాదన ఏదీ లేదని సిఎం స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత కూడా ఒక అసెంబ్లీ నియోజికవర్గం ఖచ్చితంగా ఒకే జిల్లలో ఉంటుందని చేప్పలేమని సిఎం చెప్పారు. దేశంలో ఇప్పటికే 10 రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజికవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించాయని సిఎం వివరించారు.
మహబూబ్ నగర్ జిల్లాకు స్వర్ణయుగం రాబోతున్నదని, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని, పాలమూరు ప్రాజెక్టు కూడా శరవేగంతో కట్టుకుంటామని చెప్పారు. నీటిపారుదల రంగంలో పాలమూరు జిల్లా గోదావరి జిల్లాల సరసన నిలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. వలసలు పోయిన వారంతా తిరిగి పాలమూరుకు చేరుకునే రోజులు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. పాలమూరు జిల్లా అంతా నీటి సౌకర్యం వస్తుంది కాబట్టి, రైతులెవరూ తమ భూములు అమ్ముకోవద్దని సిఎం పిలుపునిచ్చారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల జరగడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పిన ముఖ్యమంత్రి, పాలమూరు ప్రజలను, ప్రజాప్రతినిధులను అభినందించారు. కృష్ణా నది వల్ల ఎక్కువ ప్రయోజనం పాలుమురు జిల్లాకే కలుగుతుందిని చెప్పారు. పాలమూరు రైతులకు నీళ్ళివ్వడం గొప్ప కార్యంగా తానూ భావిస్తున్నట్లు సిఎం వెల్లడించారు. బౌగోళికంగా చాలా పెద్దదైన మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలుగా మారడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. పాలమూరు జిల్లలో ఉన్న అన్ని జాతీయ రహదారులకిరువైపులా విరివిగా మొక్కలు నాటాలని, తెలంగాణలో అడుగుపెట్టేవారికి పాలమూరు జిల్లా ఆకుపచ్చ తోరణాలతో స్వాగతం పలికినట్లుండాలని సిఎం చెప్పారు.
హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. హెల్త్, ట్రైబల్ యునివర్సిటీలతో పాటు అనేక విద్యాసంస్థలను మంజూరు చేశామని, టెక్స్ టైల్ పార్కు నిర్మించబోతున్నామని వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లో రూ. 300 కోట్లు కేటాయించామని, హృదయ్, స్మార్ట్ సిటీలో కూడా ఎంపికైనందున దానికి అనుగుణంగా ప్రణాళికాబద్దంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత, కొన్ని మండలాలు యాదాద్రిలో, కొన్ని మండలాలు సిద్దిపేటలో కలుస్తున్నాయన్నారు. మిగిలిన మండలాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నందున వరంగల్ జిల్లాను రెండు జిల్లాలుగా చేయాలని ప్రతిపాదించినట్లు సిఎం చెప్పారు. రెండు జిల్లాల స్వరూపం ఎలా ఉండాలనే అంశంపై ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నామని, వాటికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
- వరంగల్ - హైదరాబాద్ ప్రధాన రహదారిపై కాజీపేట వద్ద ఫాతిమా బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మించి, నాలుగు లేన్ల రోడ్డుగా మార్చనున్నట్లు సిఎం ప్రకటించారు. వెంటనే అంచనాలు రూపొందిచాలని నేషనల్ హైవేస్ ఇ.ఎన్.సి గణపతి రెడ్డిని ఆదేశించారు.
- మహబూబ్ నగర్ పట్టణంలో దాదాపు 5 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును నిర్మిచాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేసిన విజ్ఞప్తి మేరకు రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
- దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మహబూబ్ నగర్ జిల్లాలోని గట్టు మండలాన్ని రెండు మండలాలుగా విభజించే ప్రతిపాదనలను పరిశీలించాలని సిఎం అధికారులను ఆదేశించారు.
- ఖమ్మం జిల్లా గుండాల మండలం విస్తీర్ణంలో చాలా పెద్దగా ఉన్నందున ఆ మండలాన్ని రెండుగా విభజించాలని చెప్పారు.
- ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలాన్ని సమీపంలోని శంషాబాద్ జిల్లాలో చేర్చాలని సిఎం అధికారులను ఆదేశించారు.
- ప్రతిపాదిత మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు రెవెన్యూ డివిజన్లో చేర్చాలని ఆదేశించారు.
- వరంగల్ జిల్లాలో టేకుమట్ల, పెద్ద వంగర, కొమురవెల్లి మండలాల ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలని సిఎం ఆదేశించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

తెలంగాణకు హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ జిల్లాల్లో, తమ శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దుల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అందమైన రకరకాల పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కా ర్యక్రమాన్ని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 165 కిలోమీటర్ల రోడ్డుపై ఒకేసారి 85 వేల మంది మొక్కలు నాటుతారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటుతారు. ఈ మొత్తం రహదారిని 14 సెంగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెంగ్మెంటుకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షిస్తున్నారు. స్వయం సహాయక బృందాల సభ...

సీఎంపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల పాలనంతా అస్తవ్యస్తమేనని... వేసీపీ నేత రోజా విమర్శించారు. ఆయనకు మూడేళ్లూ కుర్చీ కాపాడుకోవటానికి సరిపోయిందన్న రోజా... వైఎస్ పథకాలను పేర్లు మార్చి మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆరోపించింది. కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసుంటే... 2009లోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది