ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ లోని నయాగారా జతపాతాలు....

ప్రకృతి అందాలను తిలకించటానికి మనం ఊటీ,కొడైకెనాలన్‌ ,డెహ్రడూన్‌,జమ్ముకాశ్మీర్‌  ఇలా... వివిద ప్రాంతాలకు వెలుతాం. జలపాతాలు ఎత్తైన కొండలు... పైనుంచి జావువారుతూ జలపాతం క్రిందకి అలా...దుకుతుంటే... చుట్టుప్రక్కల పచ్చదనం..చల్లటి వాతావరణం మససును శరీరాన్ని ఉత్తేజ పరుస్తుంది.  జలపాతాలను వీక్షించడానికి ఎక్కడో వెళ్లాల్సిన పనే లేకుండా మన తెలంగాణ రాష్ట్రంలోని కుంటాల జలపాతం ,మల్లెలతీగ,భీముని పాద,బొతగ జలపాతాలు వెళితే ఆహ్లదకరమైన వాతావారణం...ప్రకృతి రమనియతను తిలకించవచ్చు. వర్షాకాలంలో ఇవి మరింత శోభితంగా ఉంటాయి.
మల్లెల తీర్థం 
 హైదరాబాద్నుంచి 185 కి.మీ.దూరంలో ఉన్న మల్లెల తీర్థం  చేరుకోవాలంటే.. 350 మెట్లు కిందకు దిగాల్సి ఉంటుంది.  అడని ప్రాంతం కావటంతో  సౌకర్యాలు ఉండవు, మన వెంట అవసరమైన ఆహార పదార్థాలతో  పయానం సాగాలి. అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ జలపాతం ఉద్ధృతంగా ఉంటుంది. మహబూబ్నగర్జిల్లాలోని నల్లమల అడవుల్లో మల్లెల తీర్థం జలపాతం ఉంది.
భీముని పాద 
వరంగల్జిల్లా గూడురు మండలం సీతానగరంలో భీముని పాద జలపాతం ఉంది. భీముడు ఇక్కడ పాదం మోపిన చోటు నుంచి నీళ్లు పడుతున్నాయనేది స్థానికంగా ప్రతీతి. నర్సంపేటకు 59.5 కి.మీ. అక్కడి నుంచి 17 కి.మీ.దూరంలో 14 కిలోమీటరు దగ్గర భూపతిపేట్కి రెండు నుంచి 3 కి.మీ. దూరం ప్రయాణించి కొమ్ముల వంచ గ్రామానికి చేరుకుంటే భీముని పాద జలపాతానికి చేరుకోవచ్చు. ఇక్కడ ఉండడానికి వసతుల్లేవు. నేరుగా వరంగల్కు చేరుకుని బస చేయాల్సిందే.
బొగత 
ఖమ్మం జిల్లా వాజేడు మండలం, కోయవీరపురంలో జపాతం ఉంది. భద్రాచలం శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకుని వెళ్లాలంటే 120 కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. వరంగల్నుంచి 140 కి.మీ. దూరం. హైదరాబాద్నుంచి 329 కి.మీ. దూరంలో ఉన్న జలపాతం.. అమెరికాలోని నయాగరాను తలపిస్తుంది. ఇక్కడకు వెళ్లే వారు ఆహారాన్ని కూడా వెంట తీసుకు వెళ్లాల్సిందే. ఏటూరునాగారం దగ్గర వంతెన నిర్మించడంతో ఇక్కడకు వెళ్లడానికి దూరం తగ్గింది. జలపాతం వరకూ సరైన రహదారి లేకపోవడంతో కొంత దూరం ట్రెక్కింగ్చేయక తప్పదు. జూన్నుంచి నవంబర్వరకూ సందర్శకులు అధికంగా వస్తుంటారు. ఇక్కడ నివాస సౌకర్యంతో పాటు.. భోజన వసతి ఉంటే సాహస పర్యాటకం అభివృద్ధికి వూతమిస్తుంది.

కుంటాల జలపాతం.. 
జలపాతం అనగానే ఆదిలాబాద్జిల్లా అందరికీ గుర్తుకొస్తుంది. సహ్యాద్రి పర్వత పంక్తుల్లో కడెం నదిపై కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో వాటర్ఫాల్స్ఉన్నాయి. ఏడో నంబరు జాతీయ రహదారిపై నిర్మల్నుంచి అదిలాబాద్వెళ్లే మార్గానికి కుడివైపున ఉన్న నేరగొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతానికి తెలంగాణ టూరిజం బస్సులు నడుపుతోంది. 45 మీటర్ల ఎత్తు నుంచి అమాంతం కిందకు దూకే ప్రవాహం ఆకట్టుకుంటుంది. నీళ్లు పడే ప్రాంతం బండరాయితో నునుపుదేరి ఉంటుంది. హైదరాబాద్నుంచి కుంటాలకు 250 కి.మీ. నిర్మల్నుంచి 45 కి.మీ. జలపాతం దగ్గర వసతి సౌకర్యం లేదు. నిర్మల్లో బస చేయాల్సిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.