ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మిషన్ భగీరథ పనులు-అన్ని గ్రామాలకు మంచినీరు

వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు మంచినీరు చేరేలా మిషన్ భగీరథ పనులు జరగాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నదుల నీళ్లు గ్రామాలకు చేరే నాటికి గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, అంతర్గత పైపులైన్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. అన్ని పనులు సమాంతరంగా జరగాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్థన్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, హనుమంత్ షిండే, జలగం వెంకట్రావు, ఆర్.డబ్ల్యు.ఎస్. ఇఎన్‌సి సురేందర్ రెడ్డి, సిఇలు సురేష్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో 66,800 ఇండ్లలో నల్లాలు పెట్టి ప్రస్తుతం నీరందిస్తున్నామని, గతంలో చేసిన ప్రయత్నాల వల్ల సిద్దిపేట నియోజకవర్గంలో కూడా మంచినీళ్లు అందుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలోని దాదాపు కోటి ఇండ్లకు నల్లాల ద్వారా మంచినీరు ఇవ్వాలని సూచించారు. ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఎలక్ట్రో మెకానికల్ పనులు, పైపులైన్ల నిర్మాణం జరగాలని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వేగం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు నీరు చేరుకుంటుందని, అదే సమయంలో గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సిఎం చెప్పారు. గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణం, ఇండ్లలో నల్లాలు బిగించే పనులు జరగాలని చెప్పారు. దీనికోసం అధికారులంతా సమావేశమై వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. గ్రామాలకు నీరు చేరిన వెంటనే మంచినీటి సరఫరా వ్యవస్థకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పనులను చేపట్టే ఏజన్సీలే పదేళ్ల వరకు నిర్వహించే నిబంధన పెట్టినందున పనుల్లో నాణ్యత ఉంటున్నదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.
నీటి పారుదల ప్రాజెక్టుల నుంచి మంచినీటి కోసం పది శాతం నీటిని వాడుకోవాలనే విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకన్నందున, దానికి అనుగుణంగా రిజర్వాయర్ల నుంచి నీటిని వాడుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాత ప్రాజెక్టులతో పాటు, కొత్తగా నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టుల రిజర్వాయర్ల నుంచి నీటిని వాడాలని కోరారు. ఏ రిజర్వాయర్ నుంచి ఎంత నీరు తోడి, ఎక్కడ వాడాలనే విషయంలో స్పష్టత కావాలని, ఇందుకోసం ప్రత్యేకంగా జీవో విడుదల చేయాలని మంత్రి హరీష్ రావును ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించి, కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, నగర ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ శాఖ తరుఫున మంచినీటి సరఫరా జరుగుతున్నదని, కొత్తగా నగర పంచాయితీలుగా మారిన ప్రాంతాల్లో ఆర్.డబ్ల్యు.ఎస్. ద్వారానే నీటి సరఫరా జరగాలన్నారు. ఇందుకోసం కూడా కార్యాచరణ రూపొందించాలని సిఎం ఆదేశించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు