ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

60 మందితో కూడిన ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందం

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఎన్.డి.ఆర్.ఎఫ్., సైనిక దళాలను రాష్ట్ర అధికారులు సిద్ధం చేశారు. 60 మందితో కూడిన ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందం హైదరాబాద్ లో సిద్ధంగా ఉంది. సైనికులు కూడా సహాయక చర్యలు అందించేందుకు సిద్దంగా ఉన్నారు. అవసరాన్ని బట్టి వారి సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రంలో వానలు, వరదలు, వాటి ఫలితంగా ఏర్పడిన పరిస్థితిపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సచివాలయంలో సమీక్షించారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కెటి. రామారావు, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.కె. జోషి, ఎంజి. గోపాల్, ప్రదీప్ చంద్ర, ఎస్పి సింగ్, జీహెచ్ఎంసి కమీషనర్ జనార్థన్ రెడ్డి, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. వర్షాలు, వరదలు, రహదారులు, విద్యుత్, ప్రాజెక్టుల వద్ద ప్రవాహ ఉధృతి, చెరువుల పరిస్థితి, ప్రజారోగ్యం తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేకరుల సామావేశంలో ముఖ్యమంత్రి వెల్లడించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు