ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యాదాద్రి దేవస్థానం తుది నమూనా ఆమోదముద్ర

వ చ్చే ఏడాది దసరానాటికి యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది భక్తుల సందర్శనార్థం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణ కౌశలంతో దైవభక్తి ఉట్టిపడే విధంగా పవిత్ర శిల్పకళా నైపుణ్యంతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. ప్రధాన ఆలయ సమూదాయాల నిర్మాణం, భక్తులు సేదతీరేందుకు నిర్మించనున్న వివిధ రకాల కాటేజీల నిర్మాణానికి సంబంధించి త్రీడి వీడియో ఫోటోలను సిఎం వీక్షించారు. సిఎం సూచనల మేరకు ఆగమశాస్త్ర పండితుల నిర్దేశాల మేరకు నిర్మితమవుతున్న ఆలయ కట్టడాల త్రీడి నమూనాల పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవార సిఎం క్యాంపు కార్యాలయంలో యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతికి సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఐటి శాఖ మంత్రి కె.టి. రామారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, సిఎం స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, యాదాద్రి ఆలయ అభివృద్ది సంస్థ సిఈఓ కిషన్ రావు, ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి, బడే రవికిరణ్, ఈఒ గీత తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఐదు రాజగోపురాలతో పాటు ప్రాకార మండపాలను పూర్తిస్థాయి శిలతో నిర్మితం కానున్న ప్రపంచంలోనే మొదటి దేవస్థానంగా యాదాద్రి చరిత్రలో నిలిచిపోనున్నదని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయ సముదాయాన్ని పూర్తిస్థాయి కృష్ణ శిలతో నిర్మితం కావడం విశేషమని సిఎం అభిప్రాయపడ్డారు. 500 మంది నిష్ణాతులైన శిల్పులు యాదాద్రిలో ఇప్పటికే శిల్పాలు చెక్కడంలో, తదితర నిర్మాణ పనులలో నిమగ్నమయ్యారని అధికారుల ద్వారా తెలుసుకున్న సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు.


యాదాద్రిలో భక్తుల బస కోసం నిర్మించ తలపెట్టిన కాటేజీలకు కొన్ని చిన్న చిన్న మార్పులతో ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సిఎం వంటి విఐపిలు దైవ దర్శనార్థం వచ్చినప్పుడు బస చేసేందుకు చేస్తున్న ప్రత్యేక కాటేజీలు ‘‘దైవ సన్నిది’’ నిర్మాణాలను ప్రకృతి రమణీయతతో అడుగడుగునా దైవ సన్నిదిలో సేదతీరిన చందంగా తీర్చిదిద్దడం పట్ల సిఎం అభినందించారు. ఆగమ శాస్త్ర సూత్రాలను తూచా తప్పకుండా తంజావూరు వంటి వేల సంవత్సరాల క్రిందటి సాంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి దేవాలయం ప్రాణ:ప్రతిష్ట పోయనున్నదన్నారు. పూర్తిస్థాయి నిర్మాణాల అనంతరం యాదాద్రి గుట్టపైన వెల్లి విరియనున్న పచ్చదనం తదితర ప్రకృతి రమణీయ సుందర నిర్మాణాలతో ఆలయ పరిసరాల ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 250 ఎకరాల్లో నిర్మితమవనున్న వసతి గృహాల సముదాయాల నిర్మాణానికి మొగ్గు చూపుతూ ఇప్పటికే పలు కార్పోరేటు సంస్థలు ముందుకు రావడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు.


యాదాద్రి దేవస్థాన క్షేత్ర పాలకుడిగా 108 అడుగుల భారీ విగ్రహంతో నిలవనున్న ఆంజనేయ స్వామి పాలరాతి విగ్రహా నమూనాకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇంతటి భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు చైనాకు చెందిన రూపశిల్పులు ముందుకు వచ్చారు. భారీ ఆంజనేయ విగ్రహా నిర్మాణానికి ఆర్కిటెక్చర్ ఆనందసాయి ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు త్వరలో చైనాను సందర్శించనున్నారు. పాలరాతితో తయారు చేసిన మోడల్ ప్రతిమను వారికి అప్పగించి భారీ విగ్రహ రూపకల్పనకు నాంది పలకనున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు