ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రజల మధ్యనే వుండాలని ప్రజా ప్రతినిధులకు ఆదేశం

మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదవుతున్నందున హైదరాబాద్ లో అసాధారణ పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడమే కాకుండా మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని వారాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు (పాఠశాలలు, కళాశాలలతో సహ ఇతర విద్యాలయాలు) ముఖ్యమంత్రి సెలవు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి గురువారం హైదరాబాద్ లో పరిస్థితిపై ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. మున్సిపల్ శాఖ మంత్రి కె.టి. రామారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ మహెందర్ రెడ్డి, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు రఘనందన్ రావు, రోనాల్డ్ రాస్ లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి తో పాటు నగరానికి చెందిన మంత్రులు, జీహెచ్ఎంసీ యంత్రాంగం, పోలీస్ శాఖ రేయింబవళ్లు అప్రమత్తంగా వుండి ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి ప్రజలకు తగు సూచనలు, సలహాలు చేయాలన్నారు. ఎంతటి అసాధారణ పరిస్థితులు వచ్చినా ఏ మాత్రం ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో వున్న వారిని, కూలిపోవడానికి సిద్దంగా వున్న ఇండ్లల్లో వున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, వాటి నంబర్లు ప్రజలకు తెలపాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను 24 గంటలు తీసుకుని వెంటనే స్పందించాలన్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాలను సహాయ చర్యల్లో ఉపయోగించుకోవాలన్నారు.


మున్సిపల్ శాఖ మంత్రితో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు, ప్రజల మధ్యనే వుండి పరిస్థితికి అనుగుణంగా స్పందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హుస్సెన్ సాగర్ తో పాటు ఇతర చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పడు మధింపు చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలుగని విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ప్రవాహం, వరదల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.
ముఖ్యమంత్రి ఆదేశానుసారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుతో పాటు ఇతర మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సమావేశమయ్యారు. పరిస్థితిని తెలుసుకుంటూ రాబోయే రెండురోజుల పాటు అనుసరించాల్సిన వ్యూహన్ని కరారు చేసుకున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

తెలంగాణకు హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ జిల్లాల్లో, తమ శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దుల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అందమైన రకరకాల పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కా ర్యక్రమాన్ని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 165 కిలోమీటర్ల రోడ్డుపై ఒకేసారి 85 వేల మంది మొక్కలు నాటుతారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటుతారు. ఈ మొత్తం రహదారిని 14 సెంగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెంగ్మెంటుకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షిస్తున్నారు. స్వయం సహాయక బృందాల సభ...

సీఎంపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల పాలనంతా అస్తవ్యస్తమేనని... వేసీపీ నేత రోజా విమర్శించారు. ఆయనకు మూడేళ్లూ కుర్చీ కాపాడుకోవటానికి సరిపోయిందన్న రోజా... వైఎస్ పథకాలను పేర్లు మార్చి మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆరోపించింది. కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసుంటే... 2009లోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది