ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేసులు హైకోర్టు ద్వారానే...

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో పెండింగ్ లో ఉన్న కేసులన్నీ హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అవసరం లేదని భావించి, దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో కోరింది. దీంతో ఎపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం రాదని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15న గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ విచారణలో ఉన్న కేసులను హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఇప్పటి వరకు ట్రిబ్యునల్లో పెండింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని కేసుల విచారణ ఇకపై హైకోర్టులో జరుగుతుంది. కేసుల విచారణకు సంబంధించిన సమాచారం కూడా ఇప్పటి నుంచి కక్షిదారులకు హైకోర్టు ద్వారానే అందుతుంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రస్తుతం జరగడం లేదు కనుక, రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ ఈ ఆర్డినెన్స్ జారీ చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు