ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అన్నసంజీవిని పేరుతో జనరిక్ మందులను విక్రయిస్తుంది. రోజు రోజుకు జనరిక్ మందుల వినియోగం పెరుగుతుందని ,పేదలకు తక్కువ ధరలకే మందులు లభ్యబవుతుండడంతో, ఖరీదయిన వైద్యం పొందగలుగుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా 244 జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. అనంతపురంలో 15,చిత్తూరులో 13, కడపలో 18, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి జిల్లాలో 20,44 చొప్పున, గుంటూరులో 14, కృష్ణాలో 17,కర్నూల్‌లో 9,ప్రకాశం,నెల్లూరులో 23,7,శ్రీకాకుళంలో 17,విశాఖపట్నంలో 30,విజయనగరంలో17, దుకాణాలను ఏర్పాటు చేశారు.
సాధారణ దుకాణాలలో లభ్యమవుతున్న మందులు అధిక ధరలు ఉండటంతో సామాన్యులకు... ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడటానికి జనరిక్ ముందులను అందించాలనే లక్ష్యంతో ఈ దుకాణాలను నివాస ప్రాంతాలకు అందుబాటులో నెలకొల్పేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈమాల్ అనే ఇంజక్షన్ బయట మార్కెట్ లో రూ.160-180 వలకూ విక్రయిస్తుంటారు… కానీ అదే మందు జనరిక్ దుకాణాలలో కేవలం రూ.60 లబిస్తుంది.ఆంద్రరాష్ట్ర వ్యాప్తంగా 244 జనరిక్ దుకాణాలో రోజుకు రూ.3జ57 లక్షలకుపైగా అమ్మకాలు ఉన్నయని,ఏర్పటు చేసినపప్పటినుండి ఇప్పటి వరకు రూజ12.66 కోట్లు విలువ చేసే మందుల విక్రయాలు జరగాయని ,ప్రస్తుతం 62 రకాల జనరిక్ మందులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయని పత్రిక ప్రకటనలో పేర్కొంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి