ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ కొత్త జిల్లాల అధికార యంత్రాంగం కూర్పుపై సమీక్ష

కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని, దీనికి అనుగుణంగా అధికారుల సర్దుబాటు, కొత్త ఉద్యోగుల నియామకం జరగాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూర్పుపై ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి.లో మంగళవారం సమీక్ష జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, సీనియర్ ఐఎఎస్ అధికారులు, సీనియర్ ఐపిఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. మంత్రులు జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా సమాంతరంగా ప్రారంభం కావాలని సిఎం కేసిఆర్ తెలిపారు. ముందుగా కొత్త మండలాలను నిర్ధారించాలని, తర్వాత రెవిన్యూ డివిజన్లను కూర్పు చేయాలని సిఎం సూచించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో మొదటిరోజు నుంచే రెవిన్యూ, పోలీస్ శాఖలు పని ప్రారంభించాలని ఆదేశించారు. మిగతా శాఖల కార్యాలయాలు, అధికారుల నియామకం కూడా ఆ తర్వాత చేపట్టాలని వివరించారు. మూడు అంచెలలో పరిపాలనా విభాగాల ఏర్పాటు, అధికారుల నియామకం తదితర ప్రక్రియలను కలెక్టర్లు పర్యవేక్షించాలని చెప్పారు. మండలాల్లో రెవిన్యూ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. 
ఇప్పటికే విడుదల చేసిన డ్రాప్టు నోటిఫికేషన్ పై ప్రజల నుంచి వచ్చిన స్పందన, అధికారులు చేసిన కసరత్తుల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి పునర్ వ్యవస్థీకరణకు తుది రూపం ఇవ్వాలని సిఎం చెప్పారు. ఓ కుటంబం ఇల్లు మారినప్పుడు ఉండేలాంటి సమస్యలే, కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తలెత్తుతాయన్నారు. ప్రారంభదశలో ఎదురయ్యే సహజ సమస్యలను గుర్తించి, పరిష్కరించాలని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 75 మండలాల కోసం కొత్తగా డిమాండ్లు రాగా, వాటిలో ఇప్పటికే 45 మండలాలను నోటిఫై చేసినట్లు సిఎం చెప్పారు. మరో 30 మండలాల కోసం డిమాండ్లు వచ్చాయని, వాటి సాధ్యా సాధ్యాలపై వెంటనే నిర్ణయం జరగాలని చెప్పారు. కొత్తగా ప్రతిపాదించే మండల జనాభా 35 వేలకు పైగా ఉండాలనే నిబంధన పెట్టుకున్నామన్నారు. అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, చెంచులు నివసించే ప్రాంతాలకు సంబంధించి జనాభా విషయంలో సడలింపు ఇవ్వాలని సూచించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త మండలాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
పరిపాలనా విభాగాల ఏర్పాటుకు సంబంధించి సీనియర్ అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించారు. ఉద్యోగుల పెంపు, తగ్గింపు, సర్దుబాటు, ఆయా శాఖల పనిభారం ఆధారంగా నిర్ణయించాలన్నారు. అధికార యంత్రాంగం సమర్ధంగా పనిచేయడం, ప్రజలకు పాలన చేరువ చేయడం, శాంతి భద్రతల పర్యవేక్షణ తదితర విషయాల్లో మరింత బాగా సేవలందించడానికి అనుగుణమైన వాతావరణం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతీ కుటుంబంపై అవగాహన కలిగి వుండడం, పేదలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, క్షేత్ర స్థాయిలో స్వయంగా పనులు పర్యవేక్షించడం చిన్న పరిపాలనా విభాగాల ఏర్పాటు లక్ష్యమన్నారు. జిల్లా యూనిట్లు చిన్నగా వుంటే ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ సులువు అవుతుందన్నారు.
ఆయా ప్రాంతాల స్వభావం, సామిజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ శాఖల విభాగాలను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. ఆదిలాబాద్ లో అంటురోగాలు ఎక్కువ కాబట్టి అక్కడ వైద్య, ఆరోగ్య శాఖను పటిష్టం చేయాలని, ఏజెన్సీ ఏరియా ఎక్కువ వున్న చోట సంక్షేమ అధికారుల నియామకం ఎక్కువ చేయాలని సిఎం వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు ఎక్కువ అవసరం అని సిఎం అన్నారు. దీనిని బట్టి కొత్త ఉద్యోగులను నియమించాలని సిఎం అధికారులను ఆదేశించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..