ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అద్భుత ఫలితాలు సాధిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు

అద్భుత ఫలితాలు సాధిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు నడపాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనారిటీ పిల్లలకు మంచి విద్య అందించాల్సిన బాధ్యత ఉందని, వారి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకురావాలని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 160 మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కావాలని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే 71 మైనారిటీ గురుకుల పాఠశాలలను ప్రారంభించినందున, మిగతా 89 గురుకుల పాఠశాలను వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. మొత్తం 160 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 55 వేల మందికి పైగా విద్యార్థులకు మంచి విద్య, భోజనం, వసతి కల్పించాలని చెప్పారు. ఈ విద్యాలయాలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని కూడా నియమిస్తామని చెప్పారు. విద్యా సంస్థల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అంచనా వేయాలని, కావాల్సిన నిధులను బడ్జెట్లో పెడతామని సిఎం స్పష్టం చేశారు. ప్రతీ ఏడాది మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన వ్యయాన్ని బడ్జెట్ లో తప్పక చేర్చాలని కూడా సిఎం ఆదేశించారు.
మైనారిటీ గురుకుల పాఠశాలల నిర్వహణ, కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటుపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ వ్యవహారాలు చూస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి ఎకె ఖాన్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతి కుమారి, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని, చాలా మంది విద్యార్థులు మెడిసిన్ తో పాటు పలు ఉన్నత విద్యా కోర్సులకు ఎంపికవుతున్నారన్నారు. ఆ పాఠశాలల నిర్వహణపై తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని, మైనారిటీ గురుకుల పాఠశాలలు కూడా అదే ప్రమాణాలతో నడవాలని సిఎం ఆకాంక్షించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 120 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభించాలని, గతంలో నిర్ణయించామని, అందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచే 71 మైనారిటీ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయని చెప్పారు. అయితే ఈ విద్యా సంస్థల్లో చేరడానికి మైనారిటీలు ఎంతో ఆసక్తి చూపుతున్నందున వాటి సంఖ్యను పెంచాలని నిర్ణయించామన్నారు. మైనారిటీలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడం ద్వారా వారికి మంచి జీవితం అందించగలుగుతామనేది తన ఉద్దేశ్యమని సిఎం చెప్పారు. అందుకే రాష్ట్రంలో 160 మైనారిటీ విద్యా సంస్థలు ఉండాలని నిర్ణయించామన్నారు.
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ పట్టణాల్లో ఆరు చొప్పున (మూడు బాలికలకు, మూడు బాలురకు) మైనారిటీ విద్యాసంస్థలుండాలన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి ఖచ్చితంగా ఉండాలని, ముస్లింలు ఎక్కువగా ఉన్న పట్టణాల్లో రెండు, మూడు విద్యా సంస్థలు నెలకొల్పాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 8 విద్యాసంస్థలున్నాయని, మరో 12 విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కూడా ఆదేశించారు. 5, 6, 7 తరగతుల్లో ప్రవేశం కల్పించి, ప్రతీ ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోవాలని సూచించారు. ముస్లింల జనాభాను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణంగా అదనపు విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముస్లిం పిల్లలు మంచి విద్యా వంతులు కావాలని, అందుకోసం ప్రభుత్వం అవసరమైన చేయూత అందివ్వాలని సిఎం నిర్ణయించారు.
మొదటి ఏడాది ప్రారంభించిన మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణ బాగుందని ముఖ్యమంత్రి అభినందించారు. ప్రభుత్వం నెలకొల్పిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్దులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. మైనారిటీ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు చూసి ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నాటికి అన్ని విద్యా సంస్థలకు సొంత భవనాలుండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..